Pooja Hegde: టాలీవుడ్ స్టార్ హీరోకు చెల్లెలిగా పూజాహెగ్డే.. హీరో ఎవరంటే!
Venkatesh playing brother role for Pooja Hegde. `కభి ఈద్ కభి దివాళి` సినిమాలో వెంకటేశ్, పూజా హెగ్డేలు అన్నాచెల్లెలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Pooja Hegde to act as a Sister for Venkatesh in Salman Khan Movie: స్టార్ డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'కభి ఈద్ కభి దివాళి'. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం ముంబైలోని విలేపార్లేలో వేసిన ప్రత్యేక సెట్లో చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో సల్లూభాయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో 'విక్టరీ' వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 'కభి ఈద్ కభి దివాళి' నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది.
బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. 'కభి ఈద్ కభి దివాళి' సినిమాలో వెంకటేశ్, పూజా హెగ్డేలు అన్నాచెల్లెలుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. వెంకీకి పూజా చెల్లిగా కనిపించనుందట. వెంకీ, పూజా పాత్రలకు కథలో ఎంతో ప్రాధాన్యముందని సమాచారం. వాళ్లిద్దరి అనుబంధం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. వెంకీ కుటుంబ అనుబంధాల పాత్రలో జీవిస్తాడన్న విషయం తెలిసిందే. సల్మాన్ సినిమాలో వెంకటేశ్ నటవిశ్వరూపం చూపనున్నాడట.
ఇటీవలి కాలంలో స్టార్ హీరోకు చెల్లెలి పాత్రలు చేయడానికి కూడా అగ్ర హీరోయిన్స్ వెనకాడడం లేదు. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి కుష్బూ అక్కగా నటించగా.. పెద్దన్న సినిమాలో రజనీకాంత్ చెల్లెలిగా కీర్తి సురేష్ నటించారు. తాజాగా పూజా హెగ్డే ఆ జాబితాలో చేరారు. 'కభి ఈద్ కభి దివాళి' సినిమా చిత్ర సెట్స్‌లోకి ఇటీవలే బుట్టబొమ్మ అడుగుపెట్టారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం 'విక్టరీ' వెంకటేశ్ 'ఎఫ్ 3' సినిమా పూర్తిచేసి.. విడుదల కోసం వేచిచుస్తున్నాడు. ఏప్రిల్ 27 ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వెంకీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు. వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి పూజా ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. ఇక జూన్ చివరి వారంలో 'కభి ఈద్ కభి దివాళి' సినిమా షూటింగ్‌లో వెంకీ జాయిన్ కాబోతున్నాడట.
Also Read: KGF Chapter 2 OTT: ఓటీటీలో కేజీయఫ్ చాప్టర్ 2.. సినిమాను వీక్షించాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!
Also Read: LIC IPO Listing: నిరాశపర్చిన ఎల్‌ఐసీ లిస్టింగ్.. అసంతృప్తిలో ఇన్వెస్టర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook