Kanchana 4 heroine: కొరియోగ్రాఫర్ గా, నటుడిగా, డైరెక్టర్ గా ఇలా అన్నీ రంగాల్లోనూ తనదైన శైలిలో పని చేస్తూ కెరియర్ లో ముందుకు దూసుకు వెళుతున్న రాఘవ లారెన్స్ కాంచ‌న‌, కాంచన 2, కాంచన 3 ఇలా కాంచన ఫ్రాంచైజ్ లో చాలానే సినిమాలు తీశారు. అన్నీ బ్లాక్ బస్టర్ లు కాకపోయినా.. బాక్స్ ఆఫీస్ బాగానే పెర్ఫార్మ్ చేశాయి. తెలుగులో కంటే తమిళ్ లో ఈ సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకుంటూ ఉంటాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో భాగంగా మరొక సినిమా ప్రకటించారు రాఘవ లారెన్స్. అదే కాంచన 4. చిత్ర బృందం ఇప్పటికే ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకి కూడా లారెన్స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. చిత్ర షూటింగ్‌ కూడా అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతోంది అని సమాచారం. 


షూటింగ్ త్వరగా పూర్తి చేసి.. వ‌చ్చే ఏడాది వేసవికి ఈ సినిమాని విడుద‌ల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కాంచన ఫ్రాంచైజ్ లో రాయ్ ల‌క్ష్మీ, వేదిక, నిత్యా మీనన్, తాప్సీ పన్ను హీరోయిన్లుగా నటించారు. మరి కాంచ‌న 4లో ఎవ‌రు హీరోయిన్‌గా న‌టిస్తారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


అయితే కాంచన 4 లో రాఘవ లారెన్స్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది.. అని వార్తలు వినిపించాయి కానీ.. అందులో నిజం లేదు అని రాఘవ లారెన్స్ ఆ వార్తలను కొట్టి పారేశారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ని రంగంలోకి దింపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని సమాచారం.


టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో దళపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది పూజ హెగ్డే. నిజానికి 2012 లో ముగమూడి అనే తమిళ్ సినిమాతోనే పూజా హెగ్డే హీరోయిన్గా మారింది కానీ.. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా బిజీ అయిపోయింది. మళ్లీ ఈ మధ్యనే 2022లో బీస్ట్ సినిమాతో తమిళ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. 


బీస్ట్ సినిమాతో పర్వాలేదు అనిపించిన పూజ హెగ్డే తాజాగా ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన సూర్య 44 సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు కాంచన 4 సినిమాతో  మళ్ళీ తమిళ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఓకే అన్నా కూడా అసలే ఆఫర్లు రావడం లేదు అనుకుంటున్న సమయంలో.. పూజ హెగ్డే కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.


Also Read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో Infinix


Also Read: Malaika father Suicide: స్టార్‌ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య.. 7వ ఫ్లోర్‌ నుంచి దూకి సూసైడ్‌.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.