Poonam Kaur on Jesus Christ: జీసస్ పై పూనం సంచలనం.. ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు అంటూ!
Poonam Kaur Sensational tweet on Jesus Christ: యేసు క్రీస్తును కించపరిచే విధంగా ఆయన ఎప్పుడు పుట్టాడు? ఎవరికి పుట్టాడు ? అంటూ ట్వీట్ చేసి పూనం కౌర్ కలకలం రేపింది. ఆ వివరాలు
Poonam Kaur Sensational tweet on Jesus Christ: తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయింది పూనమ్ కౌర్. తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెకు ప్రస్తుతానికి సినిమా అవకాశాలు బాగా తక్కువయ్యాయి. ఆ మధ్య ఒక ప్రముఖ హీరో తనను మోసం చేశాడంటూ కలకలం రేపిన పూనమ్ కౌర్ తర్వాత ఆ హీరోని టార్గెట్ చేస్తూ అనేకసార్లు ట్వీట్లు చేస్తూనే ఉంది.
అయితే ఎప్పుడూ నేరుగా సదరు హీరో పేరు ఆమె పేర్కొనలేదు కానీ పవన్ కళ్యాణ్ అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్లు చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా పూనమ్ కౌర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. స్వతహాగా సిక్కు మతానికి చెందిన ఆమె ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అయ్యే మతానికి సంబంధించిన ఏసు క్రీస్తు గురించి వివాదాస్పద ట్వీట్ చేసింది. అసలు జీసస్ ఎవరికి పుట్టారు? ఎలా పుట్టారు? అంటూ ఆమె ప్రశ్నించింది. నన్ను తప్పుగా అనుకోవద్దు నిజంగానే నాకు తెలియక అడుగుతున్నాను నేను అంత చదువుకున్న దాన్ని కాదంటూనే జీసస్ ఎవరికి పుట్టారు? ఎలా పుట్టారు? అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అంటూ పూనం కౌర్ ప్రశ్నించింది.
అయితే ఆమె అలా ప్రశ్నిస్తూ ఆగస్టు 27వ తేదీన ట్వీట్ చేసింది. కానీ ఈ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. అయుతె ప్రస్తుతానికి ఈ విషయం మీద క్రైస్తవ మతానికి చెందిన వారు తీవ్ర స్థాయిలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు . నమ్ కౌర్ ఇలా ప్రశ్నించడం ఏమాత్రం సరిగా లేదని, ఆమె అవమానించే ఉద్దేశంతోనే ఇలా ట్వీట్ చేసిందని వారు భావిస్తూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం మీద పూనం కౌర్ ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Sita Ramam -Karthikeya 2 Collections: రచ్చ రేపిన సీతారామం-కార్తికేయ 2.. లైగర్ ను దాటేసి మరీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి