Rajendra Prasad: ప్రముఖ సినిమాటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. తెలుగులో 1995లో నిరంతరం మూవీకి దర్శకత్వం చేయడంతో నిర్మాతగా పనిచేశారు. ఈమూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్ర పరిశ్రమలో ప్రశంసలు అందుకోవడంతోపాటు మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాల్లోనూ మెప్పించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజేంద్రప్రసాద్..ఆ నలుగురు చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌కు స్వయన సోదరుడు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తైంది. పుణెలోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్కూల్‌లో సినిమాటోగ్రఫీ పూర్తి చేశారు. పలు ఇంగ్లీష్‌తోపాటు ఇతర భాషల సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. హాలీవుడ్‌లోనూ సేవలు అందించాడు. మన్ విమన్ అండ్ ది మౌస్, రెస్డ్యూ-వేర్‌ ది ట్రూత్ లైస్, ఆల్‌ లైట్స్, నో స్టార్స్‌ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. తాను దర్శకత్వం చేసిన సినిమాలకే ఆయనే సినిమాటోగ్రాఫర్‌గా, రచయిత పని చేసే వారు. 


Also read:Trisha: రాజకీయాల్లోకి టాప్ హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!


Also read:Team India: ఆసియా కప్‌లో టీమిండియాకు అతడే కీలకం కానున్నాడు: సంజయ్ మంజ్రేకర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook