Trisha: రాజకీయాల్లోకి టాప్ హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!

Trisha: రాజకీయాల్లోకి సినీ నటులు రావడం సర్వ సాధారణం. తాజాగా మరో సీనియర్ నటి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 19, 2022, 07:48 PM IST
  • రాజకీయాల్లోకి మరో నటి
  • జోరుగా ప్రచారం
  • త్వరలో క్లారిటీ
Trisha: రాజకీయాల్లోకి టాప్ హీరోయిన్ త్రిష..? ఏ పార్టీలో చేరబోతోందంటే..!

Trisha: దక్షిణాది టాప్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తమిళ సూపర్ స్టార్ విజయ్ సూచన మేరకు ఆమె రాజకీయాల్లో వస్తున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో త్రిష ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

త్రిష నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇటు కాంగ్రెస్‌ నేతలు సైతం దీనిపై స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. ఆ పార్టీ నేతల తీరు చూస్తే త్రిష పొలిటికల్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. తన అందం, అభినయంతో సినిమాల్లో ఆమె అలరించారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల సంఘ సేవ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్నారు.

త్రిషకు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కింగ్, బాడీగార్డ్, బంగారం, స్టాలిన్, లయన్ వంటి చిత్రాల్లో నటించారు. 2016లో నాయకి సినిమా తర్వాత తెలుగు సినిమా తెరపై కనిపించలేదు. ప్రస్తుతం ఆమె తమిళ సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. వచ్చే నెల 30న త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ వన్‌ సినిమా విడుదల కానుంది. ఈమూవీని మణిరత్నం తెరకెక్కించారు. ధనుష్‌ నటించిన ధర్మయోగి సినిమాలో త్రిష పొలిటికల్ లీడర్‌గా నటించారు. 

దక్షిణాదిలో సినీ నటులు..రాజకీయాల్లో రాణించారు. తెలుగు, తమిళనాట ఇదే రుజువైంది. తమిళనాడులో ప్రముఖ నటుడు ఎంజీ రామచంద్రన్, కరుణానిధి సీఎం పీఠాన్ని అధిరోహించారు. సాధారణంగా సినీ ప్రస్థానం నుంచి రాజకీయాల్లో అత్యున్నత స్థానాలకు వెళ్లారు. తెలుగు నాట స్వర్గీయ ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీకి సీఎంగా పనిచేశారు. సినీ నటుడిగా జీవితాన్ని మొదలు పెట్టి..రాజకీయాల్లో విశేషంగా రాణించారు. 

తాజాగా త్రిష పేరు తెరపైకి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ విజయ్ ముందుండి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే త్రిష రాజకీయాల్లో సక్సెస్ కావడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్‌కు తమిళనాట మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకానొక దశలో విజయ్‌ రాజకీయాల్లో వస్తారని ప్రచారం జరిగింది. ఆయన తల్లిదండ్రులు విజయ్‌ పేరు ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేశారు. 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..మూడురోజులపాటు భారీ వర్ష సూచన..!

Also read:LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్‌కు అంతా రెడీ..బ్యాట్ పట్టనున్న మాజీ స్టార్ ప్లేయర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News