మూవీ రివ్యూ: పొట్టేల్ (Pottel)


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు: అనన్య నాగళ్ల , యువ చంద్ర కృష్ణ, అజయ్, నోయల్, బేబి తనస్వీ చౌదరి,శ్రీకాంత్ అయ్యంగర్, ఛత్రపతి శేఖర్, ప్రియాంక శర్మ,   తదితరులు


ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్


సినిమాటోగ్రఫీ: మోనిశ్ భూపతి రాజు


సంగీతం: శేఖర్ చంద్ర


నిర్మాత: సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితి,


స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సాహితీ మోత్కుర్


విడుదల తేది: 25-10-2024


అనన్య నాగళ్ల గత కొన్ని రోజుల్లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తుంది. ఈమె కథానాయికగా నటించిన నటించిన ‘పొట్టేల్’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి పలు విషయాలు పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ చేసాయి. మరి ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మీడియాకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ? పొట్టేల్ కథ తెలుగు ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..


కథ విషయానికొస్తే..


1970, 80వ దశకంలో ఈ కథ సాగుతుంది. విధర్భ (మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్) ప్రాంతంలోని గుర్రంగట్టు ఊర్లో ఈ కథ జరుగుతుంది. ఆ ఊరి గ్రామ దేవత అయితే బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని జనం నమ్మకం. అలా తరతరాలుగా పటేల్ వంశానికి బాలమ్మ పూనుతూ ఉంటుంది. కానీ పటేల్ (అజయ్)కి చిన్న తనం నుంచి బాలమ్మ పూనదు. కానీ పటేల్ తనకు బాలమ్మ పూనిందని డ్రామాలు ఆడుతుంటారు. ఆ ఊరికి వరుసగా రెండు సార్లు పొట్టేల్ బలి ఇచ్చే సమయంలో చనిపోతుంది. దీంతో రాబోయే జాతర సమయానికి  అమ్మవారికి బలిగా సమర్పించే  పొట్టేల్ ను బాధ్యతలను గంగాధర్ (యువ చంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. అయితే.. గంగాధర్ కు ఊరి పటేల్ మధ్య చిన్న గొడవ ఉంటుంది. ఈ నేపథ్యంలో అమ్మవారికి బలి ఇచ్చే పొట్టేల్ ను మాయం చేస్తాడు పటేల్. అయితే జాతర సమయానికి పొట్టేల్ తీసుకు రాకపోతే గంగాధర్ కూతురును బలి ఇస్తానంటాడు పటేల్. మధ్యలో గంగాధర్  భార్య  బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) ఎవరు.. ? తన కూతురు సరస్వతిని పటేల్ ఎందుకు బలి ఇవ్వాలనుకుంటాడు.   ఈ నేపథ్యంలో తన కూతరు ప్రాణాలను కాపాడుకోవడానికి గంగాధర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయా.. ? పటేల్ ఆగడాలకు ఊరి ప్రజలు చివరకు ఎలాంటి సమాధానం ఇచ్చారనేదే ‘పొట్టేల్’ మూవీ స్టోరీ.



కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘పొట్టేల్’ కథ విషయానికొస్తే.. మన సమాజంలో కొన్ని గ్రామాల్లో ఉన్న అంటరానితనం, బానిసత్వం, తన కింద పనిచేసే బడుగు బలహీన వర్గాల వారినీ చదువు కోనీయండా చేయడం.. వారి ఎదుగుదలను అడ్డుకోవడానికి ఆ ఊరి పటేల్ ఎలాంటి ట్రిక్స్ ప్రయోగించాడనే కాన్సెస్ట్ ను దర్శకుడు చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఈ సినిమాతో దర్శకుడు చదువు విలువ  చెప్పే ప్రయత్నం చేసాడు. 1970, 80 దశకంలో తెలంగాణ, మహారాష్ట్రలోని  గ్రామాల్లో పటేల్, పట్వారీ వ్యవస్థ ఉండేది. అందులో కొంత మంది పటేల్లు ప్రజలకు మంచి చేసిన వాళ్లు ఉన్నారు. కానీ మెజారిటీ పటేల్లు మాత్రం ప్రజలను రాచి రంపానా పెట్టినవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా  ఈ సినిమా కథలో భాగంగా గ్రామంలో బడుగు బలహీన వర్గాల చదువుకుంటే ఎక్కడ బాగు పడిపోతారనే ఉద్దేశ్యంతో .. ఊరి పటేల్ అయిన అజయ్ తనకు గ్రామ దేవత బాలమ్మ పూనినట్టు డ్రామా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఎవరు చదువుకోకూడదని అమ్మవారు చెప్పినట్టు
చెప్పి ఊరి ప్రజలను ఎవరు చదువుకోకుండా చేస్తాడు. ఈ సందర్బంగా పటేల్ క్రూరత్వాన్ని ఇంకాస్త  పకడ్బందీగా రాసుకుంటే బాగుండేది.


ఇలాంటి ‘పొట్టేల్’ తరహా  కథలు మనకు గతంలో ‘మా భూమి’ తో పాటు పలు చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కాయి. ఆయా సినిమాల్లో  ఊరి ప్రజలను ఆ గ్రామ పటేల్లు ఎలా దోచుకు తిన్నారనే విషయాన్ని కళ్లకు కట్టారు దర్శకులు. కానీ డైరెక్టర్ సాహితి మోత్కురు తాను విన్న, చదివిన తెలంగాణ పల్లె నేపథ్యానికి పొట్టేల్ తరహా కథను ఎంచుకోవడంతోనే సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్న కథను తెరకెక్కించడంలో దాదాపు 80 శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.


ఇప్పటి యూత్ కు మాత్రం ఇలాంటి కథలు కాస్త కొత్త అనే చెప్పాలి. రీసెంట్ గా రామ్  చరణ్ ‘రంగస్థలం’ సినిమా కూడా ఇదే తరహా కథాంశమనే చెప్పాలి. తన కూతురును ఓ తక్కువ కులం వాడు ప్రేమించాడని అతన్ని చంపిస్తాడు.సేమ్ టూ సేమ్ ప‘పొట్టేల్’ సినిమాలో హీరో తండ్రి తన కుమారుడు స్కూల్లో చదువు కోసం పటేల్ అనుమతి కోరడానికి వెళితే.. అక్కడ అతన్ని కొట్టి కొట్టి చంపేయడం వంటి సీన్స్ ప్రేక్షకులను మెలి పడతాయి. ఈ సినిమా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం.. వంటివి చూపించారు. గ్రామ దేవతకు బలి ఇచ్చే పొట్టేల్ చుట్టు స్టోరీని అల్లుకున్న అంతర్లీనంగా అంటరానితనం, సమాజంలో అసమానతలు, చదవు వంటివి ఈ సినిమాలో సృజించాడు దర్శకుడు.


ముఖ్యంగా కొంత మంది ఊరి పటేల్ లు తమ కింద వారి బాగు పడకుండా చేసే కుట్రలు, కుతంత్రాలను తెరపై ఇంకాస్త బెటర్ గా చూపిస్తే బాగుండేది.  అయితే.. ఈ సినిమాను కొంచెం తక్కువ నిడివితో ఇంకాస్త ట్రిమ్ చేసుంటే సినిమా లెవల్ ఇంకాస్త పెరిగేదనే చెప్పాలి.  ఈ సినిమా ప్రారంభం నుంచే హీరో ఫ్లాష్ బ్యాక్ లో కథను చెప్పించి.. ముందుగానే స్టోరీలోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా తాను చదువుకోకపోయినా.. కూతురు చదువు కోసం తండ్రి పడే తాపత్రయం. కూతరుకు చదువు చెప్పడానికి ఆ ఊరి మాస్టరు గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి ఓ తండ్రి పడే తాపత్రయం వంటివి గుండెలకు హత్తుకుంటాయి. హీరోను ఓ సన్నివేశంలో కుక్కలు పీక్కుతిన్నా.. మరుసటి రోజు మాములుగా మారిపోవడం వంటివి కొంత అతి అనిపిస్తాయి. అక్కడక్కడ లాజిక్ లేని సన్నివేశాలు..ఫస్టాఫ్ ల్యాగ్ వంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అంశాలని చెప్పాలి. దర్శకుడు 70 మరియు 80వ దశకంలో తెలంగాణ పల్లె సమాజాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ఆర్ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


నటీనటుల విషయానికొస్తే..
కొత్త నటుడు అయిన గంగాధర్ పాత్రలో యువ చంద్ర కృష్ణ .. తెలంగాణ గొర్ల కాపరి పాత్రలో మెప్పించాడు. ఈ పాత్రలో సహజ సిద్ధంగా ఒదిగిపోయాడు. అనన్య నాగళ్ల.. బుజ్జమ్మ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో పటేల్ పాత్రలో అజయ్ ఓ రేంజ్ లో ఇరగదీసాడు. విలన్ గా మైల్ స్టోన్ మూవీ అని చెప్పాలి. తన పాత్రలో క్రూరత్వం ప్రదర్శించాడు. ఇక హీరో కూతురు పాత్రలో నటించిన తనస్వీ మెప్పించింది. ఇక హీరో తండ్రి పాత్రలో నటించిన ఛత్రపతి శేఖర్.. సినిమాలో కాసేపు ఉన్న తన మార్క్ నటనతో మెప్పించాడు. ఇక ఊరి టీచర్ ధుర్యోధన్ పాత్రలో  నటించిన శ్రీకాంత్ అయ్యంగర్ నటన బాగుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.


ప్లస్ పాయింట్స్


నటీనటుల నటన


కథ


నిర్మాణ విలువలు


మైనస్ పాయింట్స్


సినిమా నిడివి


ఎడిటింగ్


లాజిక్ లేని సీన్స్


లాస్ట్ పంచ్.. ‘పొట్టేల్’.. ఆలోచింపజేసే తెలంగాణ విలేజ్ డ్రామా..


రేటింగ్: 3/5


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter