Rebel Star Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు మన మధ్య లేకపోయినా ఆయనని అభిమానించేవారు ఇప్పటికి ఎంతోమంది ఉన్నారు. కాగా రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ కృష్ణంరాజు గారి జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగల్తూరులో ఘనంగా నిర్వహించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని మీడియాతో తెలియజేశారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి, కూతురు ప్రసీద, ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం కూడా వీళ్లు నిర్వహించబోతున్నారు. ఈ వైద్య శిబిరం కృష్ణం రాజు గారు, డాక్టర్ వేణు కవర్తపు ట్రస్టీలుగా ఉన్న యూకే ఇండియా డయాబెటిక్ ఫుట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనుంది అని తెలియజేశారు. అంతేకాకుండా ఈ వైద్య శిబిరానికి జుబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి డాక్టర్ శేషబత్తారు, భీమవరంలోని వర్మ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డా.వర్మ కూడా వచ్చి పాల్గొన్న ఉన్నారట.


ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మెడిసిన్స్, చికిత్స అందిస్తారని కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి తెలిపారు.  మొగల్తూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా ఈ ఉచిత వైద్య శిబిరం సేవలను ఉపయోగించుకోవాలి ఆమె సూచించారు. 


ఈ సందర్భంగా మీడియాతో శ్యామలాదేవి మాట్లాడుతూ - ‘కృష్ణం రాజు గారి జయంతి వేడుకలను ఆయనకు ఎంతో ఇష్టమైన మొగల్తూరులో చెయ్యబోతున్నాము. ఈ సందర్భంగా శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ శిబిరానికి విదేశాల నుంచి పలువురు వైద్యులు వస్తున్నారు. ఇక్కడి ప్రజలంతా ఈ వైద్య శిబిరం సేవలు వినియోగించుకోవాలి. పేదలకు వైద్య సేవలు అందాలని ఆయన ఎప్పుడూ కోరుకునేవారు. నేను, ప్రసీద, బాబు ప్రభాస్ ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు వెయ్యి మంది దాకా ఈ వైద్య శిబిరానికి వస్తారని ఆశిస్తున్నాం’ అని తెలియజేశారు.


Also read: Udayanidhi Stalin: మరోసారి సంచలనం రేపిన స్టాలిన్, రామమందిరంపై కీలక వ్యాఖ్యలు


Also Read: Pawan Kalyan: మరోసారి సింగర్ గా మారనున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా కోసమే!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter