Prabhas Expectations: ప్రభాస్ కెరీర్ నిలబడాలంటే ఆ రెండు సినిమాలు హిట్ కొట్టాల్సిందే
Prabhas Expectations: పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో పాటు అతని అభిమానుల ఆశలన్నీ రెండే రెండు సినిమాలపై ఉన్నాయి. ఆదిపురుష్ ఫ్లాప్ కావడంతో ఆ ఆశలు మరింతగా పెరిగాయి. కెరీర్ నిలబడాలంటే ఈ రెండూ హిట్ కాకతప్పని పరిస్థితి. ప్రభాస్‌కు ఇది అత్యవసర సమయం.
Prabhas Expectations: బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ఆశించిన మేర రాణించలేదు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రభాస్ ఆశలన్నీ ఇప్పుడు ఆ రెండు సినిమాలపైనే ఉన్నాయి. రెండూ ఫుల్లీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలే కావడం విశేషం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదలైంది. ప్రభాస్ కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. దాదాపు 600 కోట్లతో నిర్మించారు. అయితే తొలి మూడ్రోజుల తరువాత సినిమా వసూళ్లు రోజురోజుకూ తగ్గిపోసాగాయి. నాలుగవరోజు నుంచి సినిమా వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. మరోవైపు సినిమా చుట్టూ వివాదాలు నెలకొన్నాయి. డైలాగ్స్, సన్నివేశాలు, పాత్రలు, నేపధ్యం అన్నింటిపై వివాదం రేగింది. ఆఖరికి సీత జన్మస్థలం విషయంలో కూడా దర్శకుడు తప్పుగా చూపించడంతో రామభక్తులకు అవమానం ఎదురైంది. సినిమా బ్యాన్ చేయాలంటూ నిరసనలు కూడా కొనసాగాయి.
బాహుబలి తరువాత సాహో ఉత్తరాదిన హిట్ అయినా దక్షిణాదిన డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత విడుదలైన రాధేశ్యామ్ ఘోరమైన డిజాస్టర్‌గా మిగిలింది. ఇప్పుడు వరుసగా రెండవ సినిమా ఆదిపురుష్ కూడా ఫ్లాప్ కావడంతో ప్రభాస్‌తో పాటు అతని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు ప్రభాస్, అతడి అభిమానుల ఆశలన్నీ రెండు సినిమాలపైనే ఉన్నాయి. అందులో ఒకటి సలార్. కేజీఎఫ్ హిట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ కావడంతో కచ్చితంగా హిట్ కొడుతుందనే నమ్మకం ఉంది అందరికీ.
ఇక మరో సినిమా భారీ బడ్జెట్‌తో పెద్ద పెద్ద నటులతో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రమిది. తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని వంటి అగ్రతారలంతా ప్రాజెక్టు కేలో నటిస్తుండటంతో చాలా అంచనాలున్నాయి. ఇక మరో స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ కూడా సినిమాలో నటించనున్నాడు. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో ఫుల్లీ యాక్షన్ లోడెడ్ సినిమా కావడంతో చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి. బడ్జెట్ కూడా 600 కోట్లు దాటి ఉండవచ్చని అంచనా.
ప్రాజెక్టు కే సినిమాకు ప్రభాస్, దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీల రెమ్యూనరేషన్ భారీగా ఉండవచ్చని సమాచారం. ప్రభాస్ ఒక్కడే 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ ఒకే ఒక పాత్రలో 20 కోట్లు, దీపికా పదుకోన్ 10 కోట్లు, ఇతరులు మరో 20 కోట్లు తీసుకోనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే సినిమా 2024 జనవరి 12న పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ప్రభాస్ కెరీర్‌కు ఈ సినిమా అత్యంత అవసరం. సలార్‌తో పాటు ప్రాజెక్టు కే సినిమా హిట్ కొట్టితీరాల్సిందే.
Also read: Samantha Pics: సెర్బియాలో సమంత విహారం.. లేటెస్ట్ పిక్స్‌పై లుక్కేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook