Prabhas Brother Prabodh To Perfrom Krishnam Raju Final Rites: సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల 25 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిస్తే సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు ఆయన అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తన సోదరుడి కుమారుడు ప్రభాస్ తనకు వారసుడు అంటూ ఆయన గతంలో ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో కూడా ఆయన పదేపదే ప్రస్తావిస్తూ ఉండేవారు. అయితే అలాంటి వారసుడు ప్రభాస్ ఇప్పుడు కృష్ణంరాజుకు తలకొరివి పెట్టడం లేదు. ప్రభాస్ ఎందుకు తలకొరివి పెట్టడం లేదు అంటే ప్రభాస్ కి ఉపనయనం జరగలేదు. కృష్ణంరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో సంప్రదాయం ప్రకారం ఉపనయనం జరిగితేనే వారు తలకొరివి పెట్టడానికి అర్హులవుతారట. అదే విధంగా ప్రభాస్కు ఒక అన్నయ్య ఉండడంతో ఈ అంత్యక్రియలు ప్రభాస్ అన్నయ్య ప్రబోధ్ చేతుల మీదుగా జరిగాయి. 


ఇక కుటుంబంలో ప్రభాస్ కంటే పెద్ద వ్యక్తి ఆయనే కావడంతో ఆయన చేతుల మీద గానే తలకొరివి పెట్టే కార్యక్రమం జరిగింది. సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఒకరి కంటే ఎక్కువ మంది కుమారులు ఉంటే వారిలో పెద్ద కుమారుడు తండ్రికి తలకొరివి పెట్టేందుకు అర్హులు. అలాగే అందరికంటే చిన్నోడు తల్లికి తలకొల్లు పెట్టేందుకు అర్హులు అవుతారు. ఈ నేపథ్యంలోనే తలకొరివి పెట్టేందుకు ప్రభాస్ దూరంగా ఉన్నారు. ఆయన బదులు ఆయన సోదరుడు ప్రబోద్ తలకొరివి పెట్టారు.


ఇక ప్రబోద్ పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపార రంగంలో ఉన్నారు. ఆయన ప్రభాస్ స్నేహితులకు చెందిన యువి క్రియేషన్స్ సంస్థకు ఫైనాన్షియర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాణ సంస్థ ద్వారానే ప్రభాస్ అనేక సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఆది పురుష్ సినిమా హక్కులను కూడా ఇదే సంస్థ కొనుక్కున్న సంగతి అందరికీ విధితమే. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కృష్ణంరాజు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మధ్యాహ్నం జరిగాయి. 


కృష్ణంరాజు అంతిమయాత్ర ప్రారంభం అయ్యాక ఆయన పార్ధివ దేహానికి పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. కృష్ణంరాజు అంతిమయాత్ర జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్ నెం 45- బిఎన్ఆర్ కాలనీ బ్రిడ్జి, గచ్చిబౌలి ఓఆర్ ఆర్ మీదుగా అప్పా జంక్షన్  అక్కడి నుంచి మొయినాబాద్ - కనకమామిడిలోని ఫామ్ హౌజ్ కు సాగింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మొయినాబాద్ - కనకమామిడి ఫామ్ హౌస్ లో ఆయన అంత్యక్రియలు జరిగాయి.  అక్కడ కృష్ణంరాజు కుటుంబం ఒక ఇల్లు కూడా నిర్మిస్తోంది ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా నివాసాన్ని కూడా అక్కడికి మార్చాలని అనుకున్నారు. ఇంతలోనే ఆయన కన్నుమూశారు. 


Also Read: Brahmastra collections: సంచలన వసూళ్ల దిశగా దూసుకుపోతున్న బ్రహ్మాస్త్రం..ఎన్ని కోట్లంటే?


Also Read: Pooja Hegde Trolled: పూజా నటనకు అవార్డా.. కొనేసుకుందేమో బాసూ.. పాపం ఆడేసుకుంటున్నారుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి