Prabhas Fan Suicide: ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని చోరగొన్నాడు డార్లింగ్ ప్రభాస్. ఆ సినిమా తర్వాత సాహోతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా తర్వాత దాదాపుగా రెండేళ్ల తర్వాత ‘రాధేశ్యామ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కరోనా లాక్డౌన్ తర్వాత మాత్రం సినిమాల్లో జోరు పెంచాడు ప్రభాస్. ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’, ‘సలార్’, నాగ్ అశ్విన్ సినిమా, ‘స్పిరిట్’ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఇన్ని చిత్రాల్లో నటిస్తున్నా.. ఆయన నటించే చిత్రాల నుంచి టైమ్ టూ టైమ్ అప్డేట్స్ రావడం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించిన యూవీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నట్లు తొలుత ప్రకటించినా.. ఇప్పటికీ ఆ సినిమా నుంచి ఏ అప్డేట్స్ రాకపోవడం పట్ల ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ప్రభాస్ సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ అభిమాని ‘రాధేశ్యామ్’ చిత్ర యూనిట్ కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



అందులో.. “సార్.. ఇంతవరకు ఒక లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా ‘రాధేశ్యామ్’ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్” అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమానిగా తన ఆవేదనను తెలిపాడు.


అంతటితో అభిమాని ఆగకుండా.. “నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్” అంటూ అభిమాని విన్నవించుకొన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాధేశ్యామ్ చిత్రాన్ని జనవరి 14వ తేదీన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.  


Also Read: Malaika Arora Gallery: బాలీవుడ్ హాట్ క్వీన్ మలైకా అరోరా లేటెస్ట్ ఫొటోషూట్ 


Also Read: Ravi Teja in Mega 154 Movie : మెగాస్టార్ మూవీలో కీలకపాత్రలో మాస్ మ‌హారాజా? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook