Salaar Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం. నిన్న డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ చిత్రంతోపాటు షారుఖ్ ఖాన్ డంకీ కూడా విడుదలైంది. కానీ ఈ చిత్రం మాత్రం మినిమం కలెక్షన్స్ కూడా సాధించలేక చతికిలపడింది. సినిమాతో పోటీగా థియేటర్స్ షారుక్ ఖాన్ సినిమాకి మాత్రమే వస్తాయి ఏమో అనుకుంటే.. దిల్ రాజు మాత్రం హైదరాబాదులో సలార్ కి పోటీగా హాయ్ నాన్న చిత్రాన్ని కూడా కొన్ని థియేటర్స్ లో కంటిన్యూ చేయొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను నైజాంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. కాగా ఈ చిత్రం విడుదలై ఇన్ని రోజులు కావస్తున్న ఇంకా దిల్ రాజు  హైదరాబాద్‌లోని చాలా కీలకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌ను సలార్ సినిమాకి ఇవ్వకుండా ఆయన చిత్రాన్ని కంటిన్యూ చేశారు. 



సలార్ సినిమాకి టికెట్లు అయిపోయి అందరూ కష్టపడుతున్న కానీ..ఇందులో ఇప్పటికీ ‘హాయ్ నాన్న’ సినిమాను ప్రదర్శించడానికి దల్ రాజు పట్టుపడ్డారు. దీంతో ప్రభాస్ అభిమానులు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుపై మండిపడ్డారు. 




ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం థియేటర్లలో ‘సలార్’ ఆడుతుండగా పక్కన సుదర్శన్ లో మాత్రం హాయ్ నాన్న కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒక ప్రభాస్ అభిమాని దిల్ రాజుని టాక్ చేసి పెట్టిన ఒక ట్వీట్ ప్రస్తుతం అందరిని ఆకర్షిస్తుంది.


ముఖ్యంగా ఆ ట్వీట్ చేసిన అభిమాని సెన్సాఫ్ హ్యూమర్‌కి అందరూ పగలబడి నవ్వుతున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏమన్నాడు అంటే.. ‘సుదర్శన్ థియేటర్‌లో హాయ్ నాన్న కంటిన్యూ చేసినందుకు థాంక్స్ సార్ దిల్ రాజు గారు. బైక్ పార్కింగ్ అక్కడ చేసి సలార్ సినిమా కోసం సంధ్యా థియేటర్ కి వెళ్లాం. ఆ క్రౌడ్‌లో పార్కింగ్ అంటే ఇంటర్వల్‌కి వెళ్లాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక ఈ పోస్టుతో హాయ్ నాన్న ఆడుతున్న థియేటర్ ఎంత ఖాళీగా ఉందో పరోక్షంగా చెప్పేశారు ప్రభాస్ అభిమాని. ఇక ఈ ట్వీట్‌కి ప్రభాస్ ఫ్యాన్స్ ఎమోజీలతో రిప్లైలు ఇస్తున్నారు.


కాగా సలార్ సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కళకళలాడిపోతున్నాయి. ఇక పోను పోను ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి