Prabhas First look: ఫస్ట్ లుక్ వచ్చేసింది.. మార్వెల్ హీరోలా ప్రభాస్..
Project K Update: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా `ప్రాజెక్టు-కే`. తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఎలా ఉందంటే..
Prabhas First look from Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం 'ప్రాజెక్టు-కే'(Project K). నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి రోజుకో సర్ ప్రైజ్ ను ఇస్తుంది మూవీ టీమ్. రీసెంట్ గా దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ (Prabhas First look)ను కూడా విడుదల చేసి డార్లింగ్ ఫ్యాన్స్ ను హ్యాపీ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ మార్వెల్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ లుక్ పై రెబల్ స్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఫేమస్ శాన్ డియాగో కామిక్ కాన్ (San Diego Comic Con) వేదికపై ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ మరియు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేందుకు మూవీ టీమ్ ఇప్పటికే అక్కడకు చేరుకుంది. ఈవేదికపై ప్రచార చిత్రాన్ని రిలీజ్ చేయనున్న తొలి భారతీయ సినిమాగా ప్రాజెక్టు కే చరిత్ర సృష్టించనుంది. ఇప్పటికే హీరో ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడకు చేరుకున్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇవాళ ఈరోజు వెళ్లనున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల దీపికా వెళ్లట్లేదు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని సుమారు రూ. 500 కోట్లతో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
Also Read: Baby Collections Day 5: బాక్సాఫీస్ వద్ద 'బేబీ' జోరు.. ఐదో రోజు వసూళ్లు మామూలుగా లేవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook