Kalki 2898AD collections day 3: ప్రభాస్ సినిమా అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలు.. నెలకొంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అలాంటి హీరోకి.. అద్భుతమైన దర్శకుడు తోడైతే.. తప్పకుండా రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అందుకే తెలుగు ప్రేక్షకులు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడి సినిమా పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులు గర్వపడే విధంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక వారి ఊహలు నిజం చేస్తూ.. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, కమల్ హాసన్, వంటి స్టార్ క్యాస్ట్ తో.. ఎంతోమంది నటినటుల కామియోలతో.. తెరకెక్కిన ఈ చిత్రం కోసం.. నిర్మాత అశ్విని దట్ ఏకంగా 600 కోట్ల..బడ్జెట్ను వెచ్చించారు. 


ఇక ఈ సినిమాకి అదే రేంజిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. మరి అంత కలెక్షన్స్ ఈ సినిమా తెచ్చుకోగలుగుతుందా అని అందరూ అనుకుంటుండగా..ఈ చిత్రం విడుదల తర్వాత అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేసుకుంటూ.. ఈ సినిమాపై నిర్మాతలకు ఉన్న నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా సాగుతోంది. 


మొదటిరోజు కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ..దేశవ్యాప్తంగా ఏకంగా 111 కోట్ల గ్రాస్.. కలెక్షన్లు అందుకుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. కలిపి 67 కోట్లు వసూలు చేయగా.. ఓవర్సీస్ లో 40 కోట్లు..ఇక  మిగతా దేశాలు మొత్తం కలుపుకొని 80 కోట్ల వరకు కలెక్షన్లు నమోదు అయ్యాయి. కాగా అదే జోరుని రెండవ రోజు కూడా కొనసాగిచ్చింది ఈ సినిమా. రెండవ రోజు కూడా కల్కి కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో.. 35 కోట్ల వరకుగ్రాస్ కలెక్షన్లు నమోదు చేసిన ఈ సినిమా.. హిందీలో 20 కోట్లు కలెక్షన్లు అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్షన్లు రెండవ రోజు  90 కోట్ల వరకు నమోదు అయ్యాయి. 


ఇక ఇప్పుడు మూడో రోజు శనివారం ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సొంతం చేసుకుందనేది.. అందరిలోనూ ఆసక్తి తెచ్చింది. కాగా వీకెండ్ కావడంతో శనివారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపింది అని వినికిడి. మూడో రోజు విషయానికి వస్తే.. ఈ సినిమా తెలుగులో సుమారుగా 30 నుంచి 45 కోట్లు, హిందీలో 30 కోట్ల రూపాయలు వరకు అందుకుంది అని త్రేడ్ వర్గాల సమాచారం. దాంతో ఇండియాలో సుమారుగా ఈ చిత్రం 80 కోట్ల రూపాయలు నికరంగా.. 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా మూడో రోజు 400 కోట్ల కలెక్షన్స్ వరకు చేరి సెన్సేషనల్.. మైలురాయి అందుకుంటోంది. ఇక ఈ సినిమా ఈరోజు ఆదివారం ఎంత సాధిస్తుందో వేచి చూడాలి.


మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ.. అది సినిమా కలెక్షన్ల పైన.. ఏమాత్రం ఎఫెక్ట్ చూపించడం లేదు. ప్రభాస్ అదిరిపోయే పర్ఫామెన్స్, విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారాగణం తో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటూ.‌ ముందుకు సాగుతోంది.


Also Read: T20 World Cup 2024 Live: వరల్డ్‌ కప్‌ లైవ్‌ అప్‌డేట్స్‌.. సాహో భారత్.. టీ 20 ప్రపంచకప్ మనదే


Also Read: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ భారత్‌దే అనిపిస్తున్నా.. దక్షిణాఫ్రికా 'కంగారు'లా పెట్టిస్తుందా?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter