Adipurush Budget and Business Breakup: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్లో తానాజీ సినిమా డైరెక్ట్ చేసిన ఓం రౌత్ ఈ సినిమాని సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాని ఓం రౌత్తో కలిసి టి సిరీస్ సంస్థ, రెట్రో ఫైల్స్ సంస్థ గ్రాండ్గా నిర్మించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ సినిమా టీజర్ మీద వచ్చిన నెగిటివ్ టాక్ తో రిలీజ్ వాయిదా వేశారు. వాస్తవానికి మోషన్ క్యాప్చర్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావించారు. అయితే టీజర్ కార్టూన్ లెవెల్ లో కూడా లేదంటూ జాతీయస్థాయిలో ట్రోలింగ్ జరగడంతో ఆలోచనలో పడ్డ సినిమా యూనిట్ వెనక్కి తగ్గి గ్రాఫిక్స్ వర్క్ మీద మరింత డబ్బు పెట్టి సమయం వెచ్చించి దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక ఈ మధ్య విడుదలైన ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.


Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?


ఈ నేపథ్యంలో ఈనెల 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆది పురుష్ సినిమా బడ్జెట్ అలాగే బిజినెస్ బ్రేకప్ ఎలా ఉంది అనే విషయాలు పరిశీలిస్తే ఇప్పటివరకు శాటిలైట్ అలాగే డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలు వచ్చాయట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ మాత్రం ఎవరికీ అమ్మలేదని తెలుస్తోంది.


ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ముందుగా యువి క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తుందని భావించిన తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ 185 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇక ఓవర్సీస్ హిందీ అలాగే ఇతర భాషలకు సంబంధించి అక్కడి లోకల్ డిస్ట్రిబ్యూటర్ల ద్వారా టి సిరీస్ సంస్థ సొంతంగా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతా బావుండి సినిమాకి కనుక మంచి హిట్ టాక్ వస్తే మొదటి వారాంతంలోనే నిర్మాతలు సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.      


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK