Adipurush Hindi Teaser : ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమా మీద ప్రస్తుతం ఉన్న నెగెటివిటీ అందరికీ తెలిసిందే. ఆదిపురుష్ టీజర్ రానంత వరకు ఒక ఇమేజ్ ఉంది.టీజర్ వచ్చాక సినిమా మీద నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. సినిమా కోసం వాడిన గెటప్స్, లుక్స్, వీఎఫ్‌ఎక్స్‌లు దారుణంగా ఉన్నాయని అందరూ ఏకిపారేశారు. ఇది మొబైల్ ఆడియెన్స్ కోసం తీసిన సినిమా కాదని, థియేటర్లో త్రీడీలో ఎక్స్ పీరియెన్స్ చేసేందుకు తీశామని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు ఆదిపురుష్‌ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. రిపేర్లు చేసేందుకు వంద కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. వీఎఫ్‌ఎక్స్ మార్చబోతోన్నారని, సైఫ్ అలీ ఖాన్ గడ్డం కూడా తీయబోతోన్నారట. ఇలా చాలా మార్పులే అందులో జరగబోతోన్నాయట.అయితే ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా ఆదిపురుష్‌ టీజర్ ఇప్పుడు సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.


హిందీలో వంద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన టీజర్‌గా ఆదిపురుష్‌ రికార్డులు క్రియేట్ చేసింది. కేజీయఫ్ చాప్టర్ 2 టీజర్ మాత్రమే ఇంత వరకు ఆ ఫీట్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ పదకొండు కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టేసింది. ఆదిపురుష్ మాత్రం అతి తక్కువ సమయంలోనే పది కోట్ల వ్యూస్‌ను కొల్లగొట్టేసింది.


ఇలా సౌత్ సినిమాలే యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టేసింది. ఇక ప్రభాస్ స్టామినా, ఆదిపురుష్‌ క్రేజ్ చూసి బాలీవుడ్ జనాలు సైతం ఆశ్చర్యపోతోన్నట్టుగా ఉంది. యూట్యూబ్‌లో ఇలాంటి రికార్డులు చూసి బాలీవుడ్ జనాల వెన్నులో వణుకు పుట్టినట్టు కనిపిస్తోంది. సంక్రాంతి సీజన్ నుంచి తప్పుకున్న ఆదిపురుష్‌ మొత్తానికి జూన్‌కు వెళ్లింది. మరి ఇది ఆ సమయానికి అయినా వస్తుందో లేదో చూడాలి.


Also Read : Bigg Boss Satya : శ్రీ సత్య మొహం మాడింది.. బిగ్ బాస్ దెబ్బ అదుర్స్


Also Read : Super Star Krishna Death : సూపర్ స్టార్ కృష్ణ మరణం.. బాధపడాల్సిన అవసరం లేదన్న వర్మ


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook