Prabhas, Pooja Hegde's Radhe Shyam Soch Liya song out now: ప్రమోషన్స్ లో మొన్నటి వరకు కాస్త నిదానంగా ఉన్న రాధేశ్యామ్‌ మూవీ యూనిట్ ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది. రాధేశ్యామ్‌ (Radhe Shyam) మూవీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ ను స్పీడ్‌గా చేసేస్తోంది. ప్రభాస్‌, (Prabhas) పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా తెరకెక్కిన మూవీ రాధేశ్యామ్‌. ఈ మూవీని రాధాకృష్ణ కుమార్‌ (Radhakrishna Kumar‌) తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ (UV Creations) సంయుక్తంగా నిర్మించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాధేశ్యామ్‌ మూవీ తెలుగుతో (Radheshyam Movie Telugu) పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. జనవరి 14న (January 14) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈ మూవీ హిందీ వెర్షన్‌కు సంబంధించిన రెండో పాట టీజర్‌ తాజాగా రిలీజైన విషయం తెలిసిందే. సోచ్‌ లియా.. అనే ఈ సాంగ్ ఆడియో కూడా రిలీజైంది. ఈ సాంగ్‌కు మిథున్‌ (Mithoon) మ్యూజిక్ అందించారు. మనోజ్‌ మింతాసిర్‌ (Manoj M) సాహిత్యం అందించారు. అర్జిత్‌ సింగ్‌ (Arijit Singh) పాడారు.




 


Also Read : ఇండియన్ సినిమాను ఓ ఊపు ఊపేస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?


పాటను బట్టి చూస్తే ఇది విరహ గీతమని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సాంగ్ మధ్యాహ్నం 1.45కు రిలీజ్ కానుంది.



 


1970 కాలం నాటి కథాంశంతో ఇటలీ నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీతో రూపొందింది రాధేశ్యామ్‌. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే జ్యోతిష్కుడిగా... ఆయన ప్రియురాలు ప్రేరణ పాత్రలో పూజ నటించారు.


Also Read : RRR Trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్‌కు కుదిరిన ముహూర్తం.. ఎప్పుడో తెలుసా?!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook