Raja Saab Movie Story Leaked: సలార్ పార్ట్‌-1తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని మళ్లీ రేసులోకి దూసుకువచ్చాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సలార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తునే.. ప్రస్తుతం వరుస షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో కల్కీ2898ఏడీ మూవీలో యాక్ట్ చేస్తూనే.. మరోవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు ఆడియన్స్‌ను అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. లుంగీ పైకెత్తి సంక్రాంతికి వచ్చే అల్లుడిలా రెబల్ స్టార్‌కు లుక్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ఇక కథ ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఓ ఆసక్తి క్రియేట్ అయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే 'రాజా సాబ్' స్టోరీ లైన్ ఇదేనంటూ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ వెబ్‌సైట్‌ ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (IMDB) పోస్ట్ చేసింది. ప్రేమలో పడిన జంటకు దుష్టశక్తులు ఎదురవుతాయి. వాటి వల్ల ఎదురయ్యే కష్టాలను విధిని ఎదిరించి ఆ ప్రేమ జంట ఎలా పోరాడిందనే అంశాలతో 'రాజా సాబ్‌' రూపొందనుందని IMDB పేర్కొంది. ఈ విషయంపై సినిమా డైరెక్టర్ మారుతి స్పందించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేస్తూ.. ఫన్నీ రిప్లై ఇచ్చారు.


 




అరెరే నాకు ఈ స్టోరీలైన్‌ గురించి తెలియక మరో స్క్రిప్ట్‌తో సినిమా తీస్తున్నానని చెప్పారు. ఇప్పుడు IMDB సమాజం తన స్క్రిప్ట్‌ను అంగీకరిస్తుందో లేదో కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం మారుతి చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మారుతి ట్వీట్‌కు ఫన్నీ రిప్లై ఇస్తునే.. IMDB పోర్టల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వెబ్‌సైట్ ఏది పడితే అది రాసేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. మీ సినిమాలే కాదు సార్.. మీ మాటలు కూడా నవ్వు తెప్పిస్తాయంటూ మారుతి పోస్ట్‌కు కామెంట్స్ చేస్తున్నారు. 


రాజా సాబ్ మూవీ షూటింగ్ గతేడాది ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే పేరు ఖరారు అయిందని ప్రచారం జరిగింది. అయితే చివరి రాజా సాబ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. కల్కీ2898ఏడీ మే 9న ఆడియన్స్‌ ముందుకు రానుండగా.. ఆ తరువాత రాజా సాబ్ థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది. డార్లింగ్ ఫ్యాన్స్‌ ఈ ఏడాది ఫుల్‌ జోష్‌లో నిండిపోవడం ఖాయం. 


Also Read: Chandrababu Case: క్వాష్ కొట్టివేత, ద్విసభ్య ధర్మాసనంలో ఎవరేమన్నారంటే


Also Read: Upcoming Best OLED TVs 2024: Samsung, LGకి షాక్‌..డెడ్‌ చీప్‌ ధరకే AI ప్రాసెసర్‌తో మార్కెట్‌లోకి Panasonic OLED టీవీలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి