Salaar Review:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కథ


దేవా (ప్రభాస్) అసోంలోని ఓ ప్రాంతంలో బొగ్గు గనిలో పనిచేస్తుంటాడు. అదే చోటుకి ఆధ్యను (శృతిహాసన్) కిడ్నాప్ చేసి తీసుకు రావడంతో గందరగోళం మొదలవుతుంది. అక్కడే టీచర్‌గా పనిచేస్తున్న ఆధ్యాన్ని కొంతమంది ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తే ఉండగా వాళ్ల దగ్గర నుంచి దేవా కాపాడుతాడు. ఆ తర్వాత తన స్నేహితుడైనా దేవాను 25 ఏళ్ల తర్వాత వెతుక్కొంటూ ఆ ప్రాంతానికి వస్తారు వరదరాజ మన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అసలు దేవా అసోంలో తన తల్లి (ఈశ్వరీరావు)తో కలిసి ఎందుకు ఉన్నాడు. ఆ ప్రాంతానికి ఆధ్యను ఎందుకు తీసుకొస్తారు? భారత సరిహద్దులోని ఖాన్సార్ ఆటవీ ప్రాంతం ఓ రాజ్యంగా ఎలా మారింది. ఆ ప్రాంతాన్ని శాసించే మన్నార్ వంశానికి ఎలాంటి సమస్యలు వచ్చాయి. ఖాన్సార్ ప్రాంతంలో యుద్ధ విరమణ (CeaseFire) ఒప్పందాన్ని ఎత్తివేయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు? వరదరాజ తండ్రి రాజమన్నార్ (జగపతిబాబు) తన ప్రాంతాన్ని వదిలి ఎందుకు వెళ్లాడు? ఆ సమయంలో దేవా అవసరం ఎందుకు పడింది? శౌర్యంగ పర్వానికి దేవాకు ఉన్న లింకు ఏమిటి? ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానమే సలార్ కథ.


నటినటుల పర్ఫామెన్స్.. టెక్నికల్ సిబ్బంది పనితీరు:


ప్రభాస్ గురించి ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు. మరోసారి దేవా క్యారెక్టర్ లో తన అద్భుతమైన నటనను చూపించారు ప్రభాస్. మరోసారి చత్రపతి.. బాహుబలి.. లాంటి సినిమాలలో తన ఫైర్ ని తెరపైన చూపించారు మన డార్లింగ్. ఫస్టాఫ్‌లో అండర్ డాగ్‌గా కనిపించినా ఆ పాత్ర.. సెకండాఫ్‌కు వచ్చే సరికి ఊహకు అందని విధంగా ఊర మాస్ లెవెల్లో కనిపిస్తుంది. కాటేరమ్మ ఎపిసోడ్, విష్ణు తండ్రితో ఉండే రెండు ఎపిసోడ్‌లు ప్రభాస్ నట విశ్వరూపాన్ని చూపించాయి. ప్రభాస్ తరువాత ఈ సినిమాలో చెప్పుకోదగిన పాత్ర పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటన కూడా ఈ చిత్రానికి హైలెట్గా నిలిచింది. శృతిహాసన్ కథను డ్రైవ్ చేసే పాత్రలో కనిపించింది. ఈశ్వరీరావు, జగపతిబాబు, తదితరులు బలమైన పాత్రల లో కనిపించి మెప్పించారు.


ఇక టెక్నికల్ సిబ్బంది పనితీరు విషయానికి వస్తే.. రవి బస్రూర్ బీజీఎం సెకండాఫ్‌లో సీన్స్ ని ఒక లెవెల్ కి ఎలివేట్ చేసింది. భువన్ గౌడ సినిమాటోగ్రఫి.. కేజీఎఫ్ మాదిరిగానే కలర్ టోన్‌తో పర్వాలేదు అనిపించింది. యాక్షన్ సీన్లను చిత్రీకరించిన తీరు సినిమాకు మరో హైలెట్. హోంబలే బ్యానర్‌ ప్రమాణాలకు తగినట్టుగా నిర్మాణ విలువలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించారు.


విశ్లేషణ:


కథ దాదాపు ప్రశాంత్ నీల్ ఉగ్రమ్ సినిమాలాగే ఉన్న.. దర్శకుడు కథను నడిపించిన తీరుకి జోహార్ చెప్పొచ్చు. ఏవో కొన్ని సీన్లు మినహా సినిమా మొత్తం మంచి ఎలివేషన్స్ పెట్టారు. అక్కడక్కడ బోరింగ్ గా ఉన్నా కానీ.. మధ్యలో వచ్చే ఎలివేషన్స్ సీన్స్ ఆ బోరింగ్ సీన్స్ ని మన మైండ్ నుంచి చెరిపేస్తాయి.


స్నేహం, రాజ్యంలో అంతర్గత రాజకీయాలు, అధికార దాహం లాంటి అంశాలతో తెరకెక్కిన మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ సలార్. ఇక ఈ సినిమాలో నటీనటుల నటన ఈ చిత్రాన్ని ఓ లెవెల్ కి తీసుకెళ్లగా…బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరో లెవల్ కి తీసుకెళ్ళింది. సెకండ్ హాఫ్ లో మితిమీరిన హింస కొంతమంది ఆదియన్స్ కి ఇబ్బంది కలిగించిన.. మాస్ ఆడియన్స్ కి ప్రభాస్ అభిమానులకు మాత్రం కన్నుల పండుగగా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్. ఇంటర్వెల్ బ్లాక్ ఈ సినిమాకి మరో హైలెట్స్. కానీ క్లైమాక్స్ మాత్రం కొంచెం సాగదీశారు దర్శకుడు. అయితే సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూసేలా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు.



తీర్పు:


ఊహకందని యాక్షన్ సీక్వెన్స్.. అద్భుతమైన పర్ఫామెన్స్ లతో.. సలార్ అక్కడక్కడ బోర్ తెప్పిచ్చిన..  సాధారణ సినీ ప్రేక్షకులకు హిట్ గాను.. మాస్ ఆడియన్స్.. ప్రభాస్ అభిమానులకు బ్లాక్ బస్టర్ గానూ ఈ సినిమా నిలిచిపోవడం మాత్రం ఖాయం.


రేటింగ్: 3.5/5


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook