Salaar HD Available For Free:  ఎన్నో అంచనాల మధ్య ఘనంగా విడుదలయ్యింది ప్రభాస్ హీరోగా చేసిన సలార్ సినిమా. మొదటి షో నుంచి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. తమ అభిమాన హీరోకి ఎన్నో సంవత్సరాల తర్వాత సూపర్ హిట్ సినిమా వచ్చింది అని సంబరాలు చేసుకుంటూ ఉండగా ఇలాంటి టైం లో ఈ సినిమా టీమ్ కి పెద్ద షాక్ తగిలింది. అదేమిటి అంటే ఈ సినిమా విడుదలైన కొన్ని గంటలకి ఈ చిత్రం హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. ఈ సినిమా దాదాపు  2 గంటల 45 నిమిషాల  రన్‍టైమ్ తో రాగా ఈ మొత్తం సినిమా ఆన్లైన్ లో ..టెలిగ్రామ్.. ఐ బొమ్మ లాంటి సైట్స్ లో లో పెట్టేయడంతో సినీ ప్రేక్షకులు షాక్ కి గురవుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా కనీసం 347 కోట్ల రేంజ్‌లో షేర్‌ని 650 కోట్ల గ్రాస్‌ను అందుకుంటేనే సూపర్ హిట్ గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇలా ఈ చిత్రం పైరసీ ప్రింట్ అప్పుడే దాదాపు చాలా ఆన్లైన్ సైట్లో అప్లోడ్ అవ్వడం ప్రభాస్ అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.



మరి పైరసీ నుంచి బయటపడి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే వేచి చూడాలి. ఇక ఆలానే ఈ సినిమా టీం పైరసీ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా తెలియాల్సి ఉంది.


ఇక  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని కూడా కేజీఎఫ్ సినిమాని నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ నిర్మించారు. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగ ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, ఈశ్వరి రావు, మధు గురుస్వామి, శ్రీయా రెడ్డి తదితరులు కీలక పాత్రలో కనిపించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. శాటిలైట్ హక్కులు భారీ మొత్తం చెల్లించి స్టార్ మా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook