Prabhas: అర్జున్‌రెడ్డి సినిమాతో బ్లాక్‌బస్టర్‌తో క్రేజీ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయారు సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga). ఇదే చిత్రాన్ని బాలివుడ్‌లో షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడా పెద్ద హిట్‌ కొట్టాడు. దీంతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఈయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas 25th movie) తో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. దీనికి స్పిరిట్Spirit) అనే టైటిల్ ఖరారు చేశారు. టీ సిరీస్‌, సందీప్‌ రెడ్డికి చెందిన నిర్మాణ సంస్ధ కూడా సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా 8 భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండటం విశేషం. అయితే ఈ భారీ చిత్రానికి ప్రభాస్‌(Prabhas) పాన్‌ ఇండియా లెవల్లో భారీ రెమ్యూనిరేషన్‌ పొందుతున్నాడని బీ టౌన్‌ టాక్‌. ‘స్పిరిట్‌’ సినిమాకు ప్రభాస్‌ ఏకంగా రూ.150 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకోనున్నాడని బాలివుడ్‌(Bollywood) ట్రేడ్‌ వర్గాల సమాచారం. బాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయల రేంజ్‌లో రెమ్యూనిరేషన్‌ అందుకుంటున్న స్టార్‌ హీరోలు పలువురున్న విషయం తెలిసిందే. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌ ఈ ‘స్పిరిట్‌’ సినిమాతో అత్యంత భారీ స్థాయి పారితోషికం అందుకుంటున్న స్టార్‌ హీరోగా నిలుస్తున్నాడని సమాచారం.


Also read: Jai Bhim: దొంగలకు కూడా ఓ జాతి ఉంటుందా? అదరగొడుతున్న సూర్య 'జైభీమ్' టీజర్


ప్రభాస్‌ ప్రస్తుతం ‘సలార్‌(Salaar), ‘ఆదిపురుష్‌’ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్న ‘సలార్‌(Salaar)’ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా సిద్ధం కానుంది. ఇందులో ప్రభాస్‌ యాంగ్రీ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే బాలీవుడ్‌ దర్శకడు ఓంరౌత్‌ సిద్ధం చేస్తున్న ‘ఆదిపురుష్‌’(Adipurush)లో ఆయన రాముడిగా కనిపించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లు పూర్తైన తర్వాత నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్న ‘ప్రాజెక్ట్‌ కే’లో ఆయన భాగం కానున్నారు. ఇక ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు ‘అర్జున్‌రెడ్డి’తో తెలుగులో సూపర్‌హిట్ అందుకున్న సందీప్‌రెడ్డి వంగా(sandeep reddy vanga) అదే చిత్రాన్ని హిందీలో ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేసి అక్కడ కూడా పాపులర్‌ అయ్యారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి