Prabhas Health News ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొన్ని షూటింగ్‌ పూర్తయితే.. ఇంకొన్ని సెట్స్ మీదున్నాయి. ఇంకొన్ని సినిమాలు సెట్స్ మీదకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్‌కు తాజాగా ఆరోగ్యం బాగా లేదట. జ్వరంతో మన డార్లింగ్ బాధపడుతున్నాడట. అందుకే సినిమా షూటింగ్‌లను క్యాన్సిల్ చేశాడు. ఈ నెలలో పీపుల్ మీడియా వారి సినిమాను ప్రారంభించాల్సి ఉందని, కానీ ప్రభాస్ ఆ షూటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టు సమాచారాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా దాదాపు షూటింగ్ అంతా పూర్తయింది. నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ అలా సాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమాల మీద చర్చలు మొదలయ్యాయి. ప్రభాస్ మైత్రి మూవీస్ సిద్దార్థ్ ఆనంద్ కాంబోలో సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది. దిల్ రాజుతో ప్రభాస్ సినిమా కూడా ఉండబోతోంది. సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా కూడా ప్రభాస్ అనౌన్స్ చేశాడు.


ఆదిపురుష్‌ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీం బిజీగా ఉంది. వీఎఫ్‌ఎక్స్, సీజీ పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. అలా ప్రభాస్ సినిమాలన్నీ ఒక్కో దశలో ఉన్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో షూటింగ్‌లు క్యాన్సిల్ చేశాడని టాక్. అయితే అభిమానులు అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభాస్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని అంటున్నారు.


ప్రభాస్ చివరగా రాధే శ్యామ్ సినిమాతో వచ్చి అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. యావరేజ్‌ టాక్‌తో ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టాడు ప్రభాస్. తన ఇమేజ్‌ను పక్కన పెట్టేసి చేసిన ప్రయోగం కావడంతో రాధే శ్యామ్ బెడిసి కొట్టిందని అంతా అంటుంటారు.


Also Read:  Jr NTR Health Issue : ఎన్టీఆర్ ఆరోగ్యం బాగా లేదా?.. ఎందుకలా అన్నాడు.. అసలు ఏమై ఉంటుంది?


Also Read: Deepthi Sunaina : కొత్త ఇంటిని ఎలా కొన్నావ్‌?.. నెటిజన్ ప్రశ్నకు దీప్తి సునయన రిప్లై హైలెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి