Prabhas Going to Play a Oldman Role In Raja Deluxe Movie: ప్రభాస్ హీరోగా ఎన్ని సినిమాలు లైన్ లో ఉన్నా మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకులు అందరిలో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ ఒక తక్కువ బడ్జెట్లో సినిమా చేస్తున్నాడు అంటే అది కేవలం మారుతీ దర్శకత్వంలోనే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్ కూడా చేయకుండానే షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపుగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తయిందని, ఇలాగే సైలెంట్ గా షూటింగ్ చేసి సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే పేరు పెట్టారు. ఒక ఇంటి చుట్టూ తిరిగే హారర్ కామెడీ సినిమాగా ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అనేక ప్రచారాలు జరిగాయి కానీ ఇప్పుడు మరో ప్రచారం తాజాగా తెరమీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఒకటి తాత పాత్ర అయితే మరొకటి మనవడి పాత్ర అని అంటున్నారు. 


సాధారణంగా తాత పాత్రను వేరే నటుడి చేత చేయించవచ్చు కానీ ప్రభాస్ చేత చేయిస్తే అది ఇంకా పండుతుందనే ఉద్దేశంతో మారుతి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఇక ఈ సినిమా హారర్ కామెడీ అనే ప్రచారం ముందు నుంచి ఉంది కానీ ఇప్పుడు కాదు పీరియాడిక్ మూవీ అని కూడా అంటున్నారు. నిజానికి ప్రభాస్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంది కానీ ఇప్పుడు ఆయనకు అన్నీ మాస్ సబ్జెక్టులు భారీ సెట్టింగ్లు ఉన్న సబ్జెక్టులే పడుతున్నాయి.


Also Read: Shruti Haasan Frock Photos: బ్లాక్ ఫ్రాక్ లో శృతి హాసన్ ట్రీట్..ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అందాల విందు


ఇలాంటి నేపథ్యంలో ప్రభాస్ మారుతి కాంబినేషన్ సినిమా బాగా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమా తాతా-మనవాళ్ళ మధ్య కథగా ఉండబోతుందని రొటీన్ గా అనిపించినా ప్రభాస్ మారుతి చేసే మ్యాజిక్ మాత్రం సినిమాకి బాగా ప్లస్ అవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విషయంలో చాలా టెన్షన్ పడుతున్నారు. బడా డైరెక్టర్లు, భారీ సెట్టింగ్లు ఉంటేనే ప్రభాస్ సినిమాలు ఇబ్బందిలో పడుతున్నాయి.


అలాంటిదేమీ లేకుండా లో బడ్జెట్లో సినిమా చేస్తున్నారు అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనే విషయం మీద వారంతా చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ తో పాటుగానే సినిమా పేరు అనౌన్స్ చేసి రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.


Also Read: Pushpa 2 Allu Arjun Flop Movies: వరుడు సహా అల్లు అర్జున్ కెరీర్లో ఎన్ని ఫ్లాపు సినిమాలు ఉన్నాయి తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook