Highest Paid Tollywood Actors: తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 10 హీరోలు వీరే!

Top Highest paid Telugu Actors from Prabhas to Raviteja: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల లిస్టు చూస్తే షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ప్రభాస్ మొదలు రవితేజ దాకా హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా?

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 12, 2023, 01:14 PM IST
Highest Paid Tollywood Actors: తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్లు అందుకుంటున్న టాప్ 10 హీరోలు వీరే!

Highest Paid Telugu Actors List Including Prabhas, Pawan Kalyan and More: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల విషయం ఒక సారి పరిశీలిద్దాం. 

ప్రభాస్
తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. బాహుబలి సినిమాతో మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్న ఆయన చేసిన అన్ని సినిమాలు దాదాపుగా పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఆయన అనేక ప్రాజెక్టు లైన్లో పెట్టారు. ప్రభాస్ ఒక్కొక్క సినిమాకి దాదాపు 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. 

అల్లు అర్జున్
ఇక ఈ లిస్టులో రెండవ స్థానాన్ని అల్లు అర్జున్ సంపాదించాడు ఆయన పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. దాదాపు ఒక్కొక్క సినిమాకి 60 నుంచి 125 కోట్ల వరకు చార్జి చేస్తున్నారట. ఇవి కాక కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

జూనియర్ ఎన్టీఆర్
ఇక ఆ తర్వాత స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్టు కొట్టిన ఆయన ఒక్కొక్క సినిమాకి 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నారట. 

రామ్ చరణ్ తేజ్
ఇక రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఆచార్య సినిమా ఇబ్బంది పెట్టినా ఆయన రెమ్యూనరేషన్ దాదాపు 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందట.  ప్రస్తుతానికి ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Also Read: Abusive Comments on Renu Desai: రేణూ దేశాయ్ చిల్లరది.. పవన్ వదిలేసి మంచి పని చేశాడన్న ఫ్యాన్!

మహేష్ బాబు 
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా హీరోగా ఒక్క సినిమా చేయకపోయినా ఆయన క్రేజ్ మాత్రం అనితర సాధ్యం. ఇప్పటికే దాదాపు 50 ఏళ్ల దగ్గర పడుతున్నా ఆయన అమ్మాయిల అందరికీ రాకుమారుడే. ఆయన ఒక్కొక్క సినిమాకి 60 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కూడా మామూలు రేంజ్ లో ఉండదు. ఆయన ఒక్కొక్క రోజుకే దాదాపు రెండు కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. ఈ లెక్కన ఆయన ఒక్కొక్క సినిమాకి 50 నుంచి 75 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు.

చిరంజీవి 
మెగాస్టార్ చిరంజీవి వయసు పెరిగినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఆయన బాస్ అనిపించుకుంటున్నాడు. తన రేంజ్ హీరోలు అంటే తన వయసు హీరోలలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన ఒక్కొక్క సినిమాకి 50 నుంచి 60 కోట్లు ఛార్జ్ చేస్తారట.

విజయ్ దేవరకొండ 
ఇక తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచాడు. విజయ్ దేవరకొండ దాదాపు ఒక్కొక్క సినిమాకి 27 కోట్ల నుంచి 45 కోట్ల వరకు చార్జి చేస్తారని అంచనాలు ఉన్నాయి.

నందమూరి బాలకృష్ణ
ఇక తర్వాత స్థానంలో నందమూరి బాలకృష్ణ నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ వయసు హీరోలలో అత్యధికంగా వసూలు చేసే హీరోగా బాలకృష్ణ నిలిచారు. ఆయన ఒక్కొక్క సినిమాకి దాదాపు 18 నుంచి 30 కోట్లు ఛార్జ్ చేస్తారు . 

రవితేజ 
ఇక టాప్ టెన్ లో రవితేజ కూడా స్థానం దక్కించుకున్నారు. ఆయన హిట్లతో సంబంధం లేకుండా ఒక్కొక్క సినిమాకి దాదాపుగా 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు చార్జి చేస్తారట.

Also Read: Sukumar mark clue: పుష్ప 2 టీజర్ లో దీన్ని మీరు గమనించారా? సుక్కూ ఏం ప్లాన్ చేశాడో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News