Prabhas Movies: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్నన్ని పాన్ ఇండియా సినిమాలు ఇంకా ఏ హీరో చేతిలో లేవనే చెప్పాలి. ఇప్పటికే సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు ఆ చిత్ర రెండో భాగంతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2898, మారుతీ దర్శకత్వంలో రాబోతున్నది ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నారు అంతేకాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాకి కూడా సైన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ లుక్స్ పై చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ చాలా మారిపోయాడని, ఫేస్ లో కూడా చాలా ఛేంజెస్ వచ్చాయని, ఫేస్ లో ముసలితనం కనిపిస్తుందని అలానే బాడీ కూడా ఫిట్ గా లేదని కామెంట్స్ వచ్చాయి. అంతేకాకుండా ప్రభాస్ కి మోకాలి సర్జరీ కూడా జరిగింది. దీంతో కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి రెస్ట్ తీసుకొని.. తన ఆరోగ్యంపై ఫోకస్ చేయాలని చూస్తున్నారట మన డార్లింగ్. 


ప్రభాస్ ఈ మధ్యనే కల్కి సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు అలానే మారుతి సినిమా  రాజా సాబ్  షూట్ సమ్మర్ లో మొదలుకానుంది. అందుకే ఈ సమ్మర్ వరకు వరకు అనగా కనీసం ఓ మూడు నెలలు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రభాస్ రెస్ట్ మోడ్ లో ఉంటాడని సమాచారం. ది రాజాసాబ్ తర్వాత సందీప్ వంగా స్పిరిట్, సలార్ 2 సినిమాలు రెండూ షూటింగ్లు కూడా వచ్చే సంవత్సరం లేదా ఈ సంవత్సరం చివర్లో మొదలవ్వనున్నాయి. కాబట్టి మధ్యలో గ్యాప్ తీసుకొని తన లుక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అని చూస్తున్నారట మన డార్లింగ్.


ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తమ హీరో తప్పకుండా బాడీ పైన కాన్సెంట్రేట్ చేసి మరల బాహుబలి టైంలో లాగా హ్యాండ్సమ్ గా వచ్చేస్తారు అంటూ ఆనందపడుతున్నారు. మరి వారు అనుకుంటున్నాట్టే మన డార్లింగ్ తిరిగి ఆ రేంజ్ లో వస్తారేమో వేచి చూడాలి.


Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
 


Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి