బాహుబలి సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేసిన ప్రభాస్ రేంజ్, బ్రాండ్ ఇమేజ్ ప్రస్తుతానికైతే ఆ బాలీవుడ్ హీరోలనే మించిపోయింది. అందుకు సాక్ష్యం ఇదిగో ఈ స్టన్నింగ్ ఫోజే!! పురుషుల లేటెస్ట్ స్టైల్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ట్రెండ్స్ వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే ప్రముఖ మెన్స్ మ్యాగజైన్ జిక్యూ ఇండియా ఈ ఏడాదిలో తీసుకొచ్చిన మొట్టమొదటి సంచిక కవర్ పేజీపై ప్రభాస్ ఫోజుని ప్రచురించింది. త్రీ-పీస్ సూటు, బూటులో హ్యాండ్సమ్ లుక్‌తో ప్రభాస్ ఇచ్చిన ఈ ఫోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా వున్న డార్లింగ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీక్యూ ఇండియా కవర్ పేజీపై ఫోజివ్వడంలో గొప్పేం వుంది అని ఓ డౌట్ రావచ్చేమో!! కానీ జీక్యూ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీకి వున్న ప్రత్యేకత తెలిస్తే మాత్రం అలా అనిపించదు. ఎందుకంటే అత్యధిక సందర్భాల్లో ఈ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించే ఛాన్స్ సొంతం చేసుకున్న వారిలో సల్మాన్, షారుఖ్, అమీర్, అమితాబ్ బచ్చన్ లాంటి లీడింగ్ బాలీవుడ్ హీరోలు, లేదంటే విరాట్ కోహ్లీ లాంటి అతికొద్దిమంది లీడింగ్ స్పోర్ట్స్ మెన్, ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్, మోడల్స్ మాత్రమే వున్నారు. అందులోనూ ఏడాది ఆరంభంలో విడుదలయ్యే సంచికపై స్థానం కచ్చితంగా వారిదే వుంటుంది. కానీ అందుకు భిన్నంగా ఈసారి బాలీవుడ్, క్రీడా ప్రముఖులని పక్కకుపెడుతూ ప్రభాస్‌ని వరించింది ఆ లక్కీ ఛాన్స్! ఇంకేం డార్లింగ్ ఫ్యాన్స్‌కి న్యూ ఇయర్‌ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి!! 


 <



>


ఈ కవర్ పేజీ ఫోజు గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన జీక్యూ ఇండియా మ్యాగజైన్.. 'బాహుబలి సూపర్ స్టార్ ప్రభాస్‌కి కొంచెం సిగ్గు ఎక్కువని, అయినప్పటికీ అతడి నుంచి కొన్ని వివరాలు రాబట్టాం' అంటూ ఆ పోస్టులో గర్వంగా పేర్కొంది. ప్రభాస్ వెల్లడించిన ఆ ఆసక్తికరమైన అంశాలు ఏంటో తెలియాలంటే ఈ జనవరి సంచిక చూడాల్సిందేనని ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఊరించింది జీక్యూ ఇండియా మ్యాగజైన్.