Prabhu Deva Compose RC 15 Song శంకర్ సినిమాలోని పాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆయన ఒక్కో పాటకు పెట్టే ఖర్చుతో భారీ సినిమాలనే నిర్మించవచ్చు. ఇప్పటికే రామ్ చరణ్‌ కియారా అద్వాణీల మీద అదిరిపోయే పాటలను కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశాడు శంకర్. ఇప్పుడు మరో పాట కోసం ప్రభుదేవాను పట్టుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. గుర్రం ఎక్కి మరీ అప్డేట్ ఇచ్చాడు శంకర్. కొత్త షెడ్యూల్ ప్రారంభం అయిందన్నట్టుగా శంకర్ ట్వీట్ వేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా గుర్రంతో శంకర్ కనిపించడంతో.. సినిమాలో అది ఉంటుందని, రామ్ చరణ్‌ను గుర్రమెక్కిస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే ఇది పాట కోసమై ఉంటుందని తెలుస్తోంది. శంషాబాద్ ఏరియాలో ఈ పాటను తెరకెక్కిస్తున్నారని,ఈ పాటకు ప్రభు దేవా కొరియోగ్రఫీ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. రామ్ చరణ్‌, కియారా అద్వాణీల మీద ఈ పాటను షూట్ చేయబోతోన్నారు.


అసలే ఆర్సీ 15 ఇప్పుడు ఫుల్లుగా ట్రెండ్ అవుతోంది. మార్చి 27న రామ్ చరణ్‌ బర్త్ డే కావడంతో ఈ సినిమా టైటిల్, స్పెషల్ పోస్టర్లు, గ్లింప్స్‌లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మేరకు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. దిల్ రాజు సైతం రామ్ చరణ్‌ బర్త్ డేకు సర్ ప్రైజ్‌లుంటాయని ఎప్పటి నుంచో హింట్లు ఇస్తూనే వస్తున్నాడు.


ఇప్పటికే రామ్ చరణ్‌ పోషించే మూడు పాత్రలకు సంబంధించిన పోస్టర్లను స్పెషల్‌గా డిజైన్ చేయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సీఈవో అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అధికారి అనే టైటిల్‌ను కూడా పరిశీలించినట్టుగా అప్పట్లో టాక్ వచ్చింది.


Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన


Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook