NBK 109: హీరోయిన్ చేంజ్.. మళ్లీ ఆమెనే తీసుకోబోతున్నారా..?
NBK 109: నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఎన్.బి.కె 109.. అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదట శ్రద్ధ శ్రీనాథ్‌ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెను కాదని.. అఖండ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రగ్య జైశ్వాల్ ను మరొకసారి బాలయ్య సరసన తీసుకోబోతున్నట్లు సమాచారం.
NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకవైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలలో హ్యాట్రిక్ అందుకుంటూ బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే గత ఏడాది భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో తన 109 వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి వీరమాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రాజస్థాన్లో యాక్షన్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఇప్పటివరకు ఇందులో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈమెను కాదని మరొకసారి అఖండ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి మెప్పించిన ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోవాలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భారీగా పండింది. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావాలని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈమె పేరును దర్శక నిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.. ఒకవేళ అన్ని సెట్ అయితే శ్రద్ధ శ్రీనాథ్ ను కాదని ప్రగ్యా జైస్వాల్ ను ఈ సినిమాలో భాగం చేయబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమాల్లో ఊర్వశీ రౌటేలా పోలీస్ ఆఫీసర్గా కీలకపాత్ర పోషిస్తూ ఉండగా, ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ఊటీలో ఒక ముఖ్యమైన షూటింగ్ ను పూర్తి చేశారు చిత్ర బృంద. ఇక త్వరలోనే రాజస్థాన్ కు చిత్ర బృందం పయనం అయ్యింది.. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్ పై డైరెక్టర్ బాబీ కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా అద్భుతమైన సినిమాకి అనుభవాన్ని అందిస్తుందని అభిమానులకు కూడా ఆయన హామీ ఇచ్చారు .మొత్తానికైతే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాలకృష్ణ ఇప్పటికే రాజకీయాలలో హ్యాట్రిక్ అందుకున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ఇక ప్రగ్య విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత భారీగా అవకాశాలు వచ్చి పడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆమె కెరియర్ కూడా నత్తనడకన సాగుతోంది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య సినిమాలో అవకాశం లభించబోతోంది మరి ఈ సినిమాతో నైనా ఈమె కెరియర్ యూ టర్న్ తీసుకుంటుందేమో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి