Prakash raj strong counter to pawan kalyan on laddu controvercy: తిరుపతి శ్రీవారి ఆలయం లడ్డు వివాదం ఏపీలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పొలిటికల్ గా కాకుండా, టాలీవుడ్ లో కూడా రచ్చగా మారింది. దీనిపై చంద్రబాబు సైతం ఐజీ స్థాయి అధికారితో స్పెషల్ గా సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత దీక్షను చేపట్టారు. అదే విధంగా  ఈరోజు విజయవాడ చేరుకుని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం మెట్లను సైతం కడిగారు. ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమలను సైతం పెట్టారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మం మీద ఎవరైన తప్పుగా మాట్లాడితే వదిలేది లేదన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అంతే కాకుండా.. దీనిపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యల్ని సైతం ఖండించారు. గతంలో పవన్ తిరుమల లడ్డుపై చేసిన వ్యాఖ్యల్ని.. ప్రకాశ్ రాజ్ ఇది జాతీయ స్థాయిలో ఏదో జరిగి పోతుందన్నట్లు పెద్దది చేయోద్దంటూ వ్యాఖ్యలు చేశారు.  తిరుమల లడ్డూ కల్తీ అయిందని తాము ఆవేదన చెందుతూ పోరాటం చేస్తుంటే మధ్యలో నీకు ఏంటి? అసలు నీకు ఏం సంబంధం అంటూ ప్రకాష్ రాజ్‌ను నిలదీశాడు.


సాటి హిందువులే తోటి హిందువుల గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుళ్లలో దొంగతనాలు జరిగినా, విగ్రహాల శిరచ్ఛేదనాలు జరిగినా మాట్లాడకుండా ఉండాలా.. అన్నారు. సెక్యులరిజం అంటే టూ వే.. నాట్ వన్ వే అంటూ మండిపడ్డారు. అసలు తిరుపతి లడ్డూ విషయంలో నీకు సంబంధం ఏంటి?.. నువ్వు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావ్ అని ప్రకాశ్ రాజ్ ను పవన్ కళ్యాణ్ కడిగిపారేశారు. 


Read more: Pawan kalyan vs prakash raj: సనాతన ధర్మం జోలికి రావోద్దు.. ఇంద్రకీలాద్రి సాక్షిగా మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. వీడియో..


దీనిపై తాజాగా.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. ప్రకాశ్ రాజ్ స్పందించారు. నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ అన్నారు. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు. ప్రస్తుతం తాను..  విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని అన్నారు. ఈనెల చివరను 30 తారీఖున వరకు వస్తానని అన్నారు. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని అన్నారు. ఇంతలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండని కూడా ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ గా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.