Pranaya Godari: ప్రయాణగోదారి నుంచి అద్భుతమైన సాంగ్.. శేఖర్ మాస్టర్ స్పందన ఇదే..
Pranaya Godari: ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా ప్రయాణ గోదారి సినిమా నుంచి మరో కొత్త పాట విడుదలైంది. ఈ పాట చాలా అద్భుతంగా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పాట ఏంటో పాటకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Pranaya Godari: ఎప్పటినుంచో ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు వీక్షకుల ఆదరణ, సపోర్ట్ ఊహించని స్థాయిలో లభిస్తోంది. అలాగే కొత్త డైరెక్టర్లు, కొత్త హీరోలు అని తేడా లేకుండా ఆడియన్స్ ఎక్కువగా కథకు ఇంపార్టెన్స్ ఇచ్చి సినిమాలు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు కూడా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో.. పి ఎల్ విగ్నేష్ డైరెక్షన్లో వస్తున్న చిత్రమే ప్రయాణ గోదారి.. ఫీల్ గుడ్ కంటెంట్తో ప్రేక్షకులను అలరించేందుకు సినీ బృందం త్వరలోనే ఈ మూవీని విడుదల చేయబోతోంది. ఈ మూవీలో హీరోగా సదన్.. హీరోయిన్ గా ప్రియాంక ప్రసాద్ యాక్టింగ్ చేశారు. ఈ మూవీ విడుదలకు ముందే కంటెంట్ అందరిలోనూ ఎంతగానో ఆసక్తి రేపింది. దీంతో సినిమా చాలా బాగుంటుందని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇప్పటికే ప్రయాణ గోదారికి సంబంధించిన ఆడియో, గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. దీంతో నెటిజన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే చిత్ర బృందం తాజాగా మరో కొత్త పాటను విడుదల చేసింది. ఈ పాట ‘తెల్లారుపొద్దుల్లో’ అంటూ అద్భుతమైన మెలోడీతో ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు మార్కండేయ బాణీకి సంబంధించిన సాహిత్యం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువ బోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాటను ధనుంజయ్ తో పాటు అదితి భావరాజు అద్భుతంగా ఆలపించారు.
అయితే ఈ పాటపై శేఖర్ మాస్టర్ ఇలా ఇలా స్పందించారు.. ఇప్పుడే ప్రయాణ గోదారి కొత్త సాంగ్ చూసానని.. చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు. ఈ సినిమాను నిర్మాత విగ్నేష్ తనకున్న ఎంతో ఫ్యాషన్ తో అద్భుతంగా అందరికీ నచ్చేలా సినిమాను తెరకెక్కించారని అర్థమవుతుందని తెలిపారు.. మోహన్ ఈ పాటకు చాలా మంచి కొరియోగ్రఫీ అందించారని చెప్పారు. అరకులో పచ్చని అడవి అందాలతో.. ఈ పాటను చిత్రీకరించడం తనకు ఎంతో నచ్చిందని.. సినిమా విడుదలై త్వరలోనే పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను అని శేఖర్ మాస్టర్ అన్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.