HanuMan Record: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా ఈ సంక్రాంతికి విడుదలైన సినిమా హనుమాన్. జనవరి 12న ఈ చిత్రంతో పాటు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సైతం విడుదలైంది. అయితే మహేష్ బాబు సినిమాకి నెగిటివ్ టాక్ రాగా హనుమాన్ కి మాత్రం పాజిటివ్ టాక్ రావడంతో.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాని సైతం ఈ చిత్రం వెనక్కి నెట్టి మరి బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హనుమాన్ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వడంతో ఇండియా అంతా ఆదరణ లభిస్తుంది. అన్ని భాషల ప్రేక్షకుల దగ్గర నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తు ఉండడంతో ఈ చిత్రం రిలీజయి నాలుగు రోజులు దాటుతున్నా థియేటర్స్ ఇంకా హౌస్ ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్న ఈ చిత్రం ఇప్పుడు కలెక్షన్స్ పరంగా మరో మైలురాయిని దాటేసింది.


హనుమాన్ సినిమా ఏకంగా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పోస్టర్ తో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. పలువురు సినిమా ట్రేడ్ ప్రముఖులు సైతం హనుమాన్ సినిమా కలెక్షన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ సినిమాని ఆకాశానికి ఎటేస్తున్నారు.


హిందీలో కూడా హనుమాన్ సినిమా జోరు కొనసాగుతోంది. ఈ చిత్రం అక్కడ ఇప్పటికే  16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక అమెరికాలో హనుమాన్ సినిమా ఏకంగా 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంటే మన లెక్కల్లో దాదాపు 24 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మరోపక్క హనుమాన్ తెలుగు వర్షన్ 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు సమాచారం. మిగిలిన సౌత్ రాష్ట్రాల్లో కలిపి హనుమాన్ సినిమా మొత్తంగా దాదాపు 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది.


 



కాగా సంక్రాంతి సెలవులు 18వ తేదీ వరకు ఉండటం, కొన్ని చోట్ల థియేటర్లు యాడ్ చేయడం వల్ల సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హిందీలో కూడా జనవరి 25 వరకు వేరే సినిమాలేవీ లేకపోవడంతో అక్కడ కూడా కలెక్షన్స్ తగ్గే సూచనలు ఏమీ కనిపించడం లేదు. మొత్తానికి హనుమాన్ తెలుగుతోపాటు హిందీలో అలానే ఇండియాతో పాటు అమెరికాలో కూడా దుమ్ము దులిపేస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.


Also Read: IND vs AFG 02nd T20I Live: కోహ్లీ రీఎంట్రీ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్లు ఇవే..!


Also Read: Shaun Marsh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన షాన్ మార్ష్.. షాక్‌లో ఆస్ట్రేలియా టీమ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter