Prasanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన చిత్రం హనుమాన్. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం పెద్ద హీరోల సినిమాలు సైతం వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం చివరిలో ఈ సినిమా దర్శకుడు ఈ చిత్రానికి సీక్వెల్ సైతం ప్రకటించారు. జై హనుమాన్ గారి రాబోతున్న ఈ సినిమా సీక్వెల్ పై ప్రస్తుతం భారీగా అంచనాలు నెలకొన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తాము అని దర్శకుడు చెప్పిన.. ఈ చిత్రం మళ్లీ 2026 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యింది అనే వార్తలు జోరుగా ప్రచారం కాసాగాయి. ఈ నేపథ్యంలో జై హనుమాన్ చిత్రం గురించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక సూపర్ అప్డేట్ ఇచ్చేశారు.


మూడు వారాలకు మించి థియేటర్లలో స్టార్ హీరోల సినిమాలు సైతం నిలవలేకపోతున్న ఈ రోజుల్లో.. వందకు పైగా థియేటర్లలో హనుమాన్ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ఈవెంట్ ని నిర్వహించారు ఈ సినిమా మేకర్స్. ఈ ఈవెంట్లో జై హనుమాన్ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు ప్రశాంత్ వర్మ.


‘హనుమాన్’కు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’కు సంబంధించి అతి త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నామని దర్శకుడు వెల్లడించాడు. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ ముగిసిందని.. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను కొనసాగిస్తున్నామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా హనుమాన్ చివరి ఐదు నిమిషాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పించిందో జై హనుమాన్ రెండున్నర గంట అంతే ఆసక్తిగా నడుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ దానికి ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతను ‘జై హనుమాన్’ను ఇంకా బాగా తీయడం ద్వారా తీర్చుుకంటానని చెప్పుకొచ్చారు ప్రశాంత్ వర్మ.


మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఒక రెండు నెలల్లోనే విడుదల చేయడానికి దర్శకుడు సన్నహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ జై హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తాడని ప్రశాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఫస్ట్ లుక్‌లో ఆ హీరో ఎవరో వెల్లడిస్తారా అని అడిగితే.. హనుమంతులవారి ఫస్ట్ లుక్కే రిలీజ్ చేస్తామంటూ నర్మగర్భమైన సమాధానం ఇచ్చేశారు ఈ దర్శకుడు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఫస్ట్ లుక్ పైన అందరి ఆసక్తి నెలకొంది.


Also Read: రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి గైడ్ లైన్స్.. అర్హులు మాత్రం వీళ్లే..


Also Read: PPF Investment: రోజుకు 400 రూపాయలు పెట్టుబడితో 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter