HanuMan 2: జై హనుమాన్‌గా స్టార్ హీరో.. సెకండ్ పార్ట్‌లో తేజ సజ్జ హీరో కాదు: ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ఈ సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకుంది హనుమాన్ సినిమా. కాగా ఈ చిత్రం సెకండ్ పార్ట్ వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని మొదటి పార్ట్ విడుదల రోజే కన్ఫామ్ చేశారు యూనిట్. తాజాగా సెకండ్ పార్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది.
Star Hero in HanuMan 2:
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా చేసిన సినిమా హనుమాన్. ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో పాటు విడుదలైన ఈ చిత్రం ఆ స్టార్ హీరోల సినిమాల కన్నా రెట్టింపు కలెక్షన్స్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ మొదటి చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల గ్రాస్ ని కూడా దాటేసి కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని హనుమాన్ ఎండింగ్ లోనే తెలియజేశారు.
ఈ చిత్రం క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా లాస్ట్ లో హనుమాన్ ఎంట్రీ చూపించి గూస్ బంప్స్ తెప్పించారు దర్శకుడు. అయితే ఆ హనుమాన్ పాత్రని కేవలం యానిమేటెడ్ గా చూపించారు తప్ప.. ఆ పాత్రలో ఎటువంటి వ్యక్తిని చూపివ్వలేదు. దీంతో ఆడియన్స్ అంతా ఆ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది..? అందులో హీరోగా ఎవరు కనిపించబోతున్నారు..? ఆ మూవీలో హనుమాన్ ఎక్కువసేపు ఉంటారు.. కాబట్టి ఆ పాత్రలో ఎవరిని చూపిస్తారు అనే సందేహాలు సోషల్ మీడియాలో కురిపిస్తున్నారు. తాజాగా వీటి గురించి స్పందించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
హనుమాన్ సినిమా బాలీవుడ్ లో సైతం రికార్డులు సృష్టిస్తుండగా..ఒక బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “జై హనుమాన్ కథ మొత్తం కూడా హనుమాన్ పాత్రతోనే సాగుతుంది. ఆ పాత్రలో ఎవరని చూపించాలని ఇంకా నిర్ణయించుకోలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో ఓ ఫేస్ చూపించి, సీక్వెల్ లో మరో ఫేస్ చూపిస్తే బాగోదని మొఖాన్ని రివీల్ చేయలేదు. జై హనుమాన్ లో ఆంజనేయ స్వామి పాత్రని టాలీవుడ్ స్టార్ హీరోనే చేస్తారు. ఇక ఈ సీక్వెల్ లో తేజ సజ్జ హనుమంతు పాత్రతోనే సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాడు” అంటూ అసలు విషయం బయటపెట్టారు ఈ దర్శకుడు. ఇక ఈ సూపర్ హీరో పాత్రల్లో టాలీవుడ్ హీరోలే కాకుండా ఇతర పరిశ్రమలోని హీరోలు కూడా కనిపించబోతున్నారంటూ చెప్పుకొచ్చారు.
అలానే తన సినిమాటిక్ యూనివర్స్ గురించి చెబుతూ.. “నెక్స్ట్ దేవతల రాజు ఇంద్రుడు పవర్స్ తో ‘ఆధీర’ సినిమా చేస్తున్నాను. జై హనుమాన్ 2025 లో వస్తుంది. ఆ తరువాత ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా మహాకాళి చేయబోతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.
Also Read: Bike Buys with Coins: పూజారి "చిల్లర ప్రేమ" కథ వినండి.. వీరి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే..
Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో ఈ విశేషాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook