Prashanth Neel Clarity on Venkatesh Maha Ridiculing Comments on KGF 2 : కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజిఎఫ్ 2 సినిమా గురించి టాలీవుడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి ప్రస్తావిస్తూ వెంకటేష్ మహా ఈ సినిమాలో ఒక మహా తల్లి ఉంటుందని కొడుకుని గొప్పోడు అవ్వాలి అంటే ఒక నలుగురికి ఉపయోగపడేలా తయారవ్వాలి అని చెప్పాల్సింది పోయి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తనకే కావాలని కోరడం ఏంటి? ఆ తల్లి మాటని పట్టుకుని ఆ నీచ కమీన్ కుత్తే బంగారం తవే వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టించి బంగారం తవ్వడం ఏమిటి? ఆ బంగారం అంతా తీసుకెళ్లి ఎక్కడో ముంచడమేమిటి? అంటూ చాలా నీచంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే వెంకటేష్ మహా మాట్లాడిన మాటలను తెలుగు ప్రేక్షకులే మెచ్చడం లేదు. ఇక కన్నడ ప్రేక్షకులు అయితే వెంకటేష్ మహాని దారుణంగా టోల్ చేస్తూ దారుణంగాలో మార్ఫింగ్ ఫోటోలు కూడా తయారుచేసి ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వెంకటేష్ మహని చాలా తక్కువ మంది సపోర్ట్ చేస్తుంటే ఆయనని ట్రోల్ చేస్తున్న వారి ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే వాస్తవానికి వెంకటేష్ మహా చెప్పిన పాయింట్ కరెక్టే కానీ చెప్పిన విధానం కరెక్ట్ గా లేదు. ఆయన మాట్లాడిన మాటలు చెప్పిన విధానం ఎద్దేవా చేస్తూ ఆ సినిమా విజయాన్ని చూసి ఓర్వలేని తనంతో చెప్పినట్లు అనిపిస్తోంది తప్ప ఎక్కడా విశ్లేషణాత్మకంగా కానీ లాజికల్ గా ప్రశ్నించిన విధంగా గాని కనిపించడం లేదు.



నిజానికి ఒక తల్లి ఇలా కొడుకుని బంగారం పోగు చేయమనడం ఏమిటి అనే పాయింట్ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఎదురైంది. ఈ విషయం మీద ఆయన అప్పట్లో క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఏ తల్లి తన కొడుకుని ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తీసుకు రమ్మని చెప్పదు.. కానీ సినిమాలో ఈ తల్లి మాత్రం తాను చిన్నప్పటి నుంచి భరించిన పేదరికంని చూసి విసుగెత్తిపోయింది. అందుకే చివరి క్షణాల్లో తన కొడుకుని బంగారం అంతా సంపాదించమని కోరుతుంది.


ఎన్నో కష్టాలు పడి జీవితాంతం గడిపిన ఆమె అన్నీ మర్చిపోలేక తన జీవిత చరమాంకంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా బతుకుతావో నాకు తెలియదు కానీ చనిపోయినప్పుడు మాత్రం ధనవంతుడిగా చనిపోవాలి అంటూ కొడుకుకి చెబుతుంది. ఇక ఇది ఒక బాధ్యత రాహిత్యమైన స్టేట్మెంట్ అనిపించడం లేదా అంటే కచ్చితంగా ఇది బాధ్యత రాహిత్యంతో కూడిన స్టేట్మెంటే అని ప్రశాంత్ అన్నారు. దీనికి మళ్లీ క్లారిటీ ఇస్తూ నేనిక్కడ ఒక పాత్ర గురించి చెబుతున్నాను, నేనేమీ ఇక్కడ బోధనలు చేయడానికి, ప్రవచనాలు చెప్పడానికో లేను. అంటూ తాను సృష్టించిన పాత్ర గురించి ఆయన అప్పట్లోనే పేర్కొన్నాడు ఇప్పుడు ఆ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా చూసేయండి మరి. 


Also Read: Pragya Jaiswal Photos: డెనిమ్ షార్ట్, జాకెట్లో ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్.. రెండిటి బటన్స్ విప్పేస్తూ టీజింగ్!


Also Read: Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి