Jai Hanuman: `జై హనుమాన్` మూవీలో అంజనాద్రి 2.Oను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ..
Jai Hanuman: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ `హనుమాన్`. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటింది. ఇపుడీ ఈ సినిమాకు సీక్వెల్‌గా `జై హనుమాన్` మూవీని తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. తాజాగా ఈ సినిమా నుంచి ప్రశాంత్ వర్మ బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Jai Hanuman: తేజ సజ్జ హీరోగా అమృతా అయ్యర్ హీరో, హీరోయిన్లుగా ప్రశాంత్ వర్మ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'హనుమాన్'. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సంచలన విజయం సాధించింది. అంతేకాదు అప్పటి వరకు రిలీజైన పొంగల్ సినిమాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. Zee5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమా 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌తో సంచలనం రేపింది. ఇక హిందీలో కూడా దాదాపు రూ. 50కోట్ల నెట్ వసూళ్లను వసూళ్లు చేసింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా ప్రశాంత్ వర్మ 'జై హనుమాన్' మూవీని తెరకెక్కిస్తున్నాడు.
ఇక హనుమాన్ సినిమాలో అంజనాద్రి అంటూ ఓ కల్పిత గ్రామాన్ని పెట్టి ప్రేక్షకులను మైస్మరైజ్ చేసాయి. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న 'జై హనుమాన్' మూవీలో అంజనాద్రి 2.O అంటూ మరో కల్పిత గ్రామాన్ని క్రియేట్ చేసాడు. సముద్రంలో అందమైన కొండలతో ఈ గ్రామం చూడచక్కగా ఉంది. ఇక జై హనుమాన్ సినిమా కథ ఎలా ఉండబోతుందో చూడాలి. బడా హీరోలను తలదన్నే బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది హనుమాన్ మూవీ. అంతేకాదు ఇప్పటి వరకు విడుదలైన పొంగల్ చిత్రాల్లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా టాలీవుడ్ చరిత్రలో మరో రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ
ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ పొంగల్ చిత్రంగా హనుమాన్ మరో రికార్డు క్రియేట్ చేసింది. హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఈ మూవీలో రానా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా 'హనుమాన్'మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సంచలనం రేపిన ప్రశాంత్ వర్మ.. రాబోయే 'జై హనుమాన్' మూవీతో ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ఆరోగ్యాన్నిచ్చే అక్రోట్లు.. డైలీ ఇలా తింటే మీ శరీరంలో బిగ్ మిరాకిల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook