Premikudu Re Release: మరోసారి థియేటర్స్‌లో అలరించడానికి సిద్దమవుతున్న ప్రభుదేవ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ `ప్రేమికుడు` మూవీ..
Premikudu Re Release: శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ, నగ్మా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ `ప్రేమికుడు`. తమిళంలో `కాదలన్` పేరుతో తెరకెక్కింది. కేటీ కుంజుమోన్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Premikudu Re Release: ఈ మధ్యకాలంలో పాత బ్లాక్ బస్టర్స్ మూవీలను రీ రిలీజ్ చేయడమనేది ఎక్కువ అయింది. ఒకపుడు ఓటీటీ, శాటిలైట్ వంటివి లేకపోవడంతో పాత సినిమాలను చూడాలనుకునే వాళ్లు ఆయా సినిమాలు రీ రిలీజ్ వరకు వెయిట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ ఛేంజ్ అయింది. విడుదలైన నెల రోజుల్లోపే ఆయ సినిమాలు ఏదో ఒక ఫ్లాట్‌ఫామ్‌లో విడుదలవుతున్నాయి. ఈ ట్రెండ్‌లో కూడా కొన్ని పాత సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజై మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ఈ కోవలో ప్రభుదేవ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ప్రేమికుడు' మూవీ మరోసారి థియేటర్స్‌లో అలరించడానికి రెడీ అవుతోంది. కేటీ కుంజుమోన్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ ఇచ్చిన సంగీతం ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. ఈ సినిమాను ఇపుడు రమణ, మురళీధర్ రీ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ లీడ్ రోల్ల యాక్ట్ చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకుడు ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, నిర్మాతలు రమణ, మురళీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పలనేని శివ మాట్లాడుతూ.. 30 యేళ్ల క్రితం విడుదలైన ప్రేమికుడు రీ రిలీజ్ అవ్వడం చాలా సంతోషకంగా ఉందన్నారు. అప్పట్లో ఈ సినిమాల ప్రభుదేవ చేసిన డాన్సులు చూసి ఆయనేమన్నా.. స్ప్రింగ్‌లు మింగడా అనే డౌట్స్ వచ్చేవి. ఒక మంచి కథగా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరోవైపు నిర్మాతలైన రమణ, మురళీధర్ మాట్లాడుతూ.. 30 యేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా ఇపుడు విడుదలై ఉంటే దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసి ఉండేదన్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించబోతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ వేడుకకు ప్రభుదేవను కూడా పిలుస్తామన్నారు. రీ రిలీజ్‌లో ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తందనే ఆషాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ , ట్రెజరర్ రామ్ సత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ,శివనాగు నర్రా, శోభారాణి, నిర్మాతలు రమణ, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
Also read: Ys jagan vs Modi: ఉమ్మడి సభలో ప్రధాని మోదీ..జగన్‌పై ఎందుకు విమర్శలు చేయలేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook