Priyadarshi Balagam : బలగం ఆమెకే అంకితం.. అమ్మ కాదు అత్తమ్మ.. ప్రియదర్శి ఎమోషనల్ పోస్ట్
Balagam Movie Mouth Talk ప్రస్తుతం సోషల్ మీడియాలో బలగం మూవీ ట్రెండ్ అవుతోంది. పాజిటివ్ టాక్‌తో బలగం మూవీ దూసుకుపోతోంది. బలగం సినిమా తెలంగాణలోని ప్రేమ, ఆప్యాయత, స్వచ్చదనానికి, పంతాలు, పట్టింపులకు ప్రతీకగా నిలిచింది.
Priyadarshi mother in Law ప్రియదర్శి ఇప్పుడు మరోసారి అందరి నోళ్లలో నానుతున్నాడు. మల్లేశం సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని అంతా ప్రశంసిస్తున్నారు. మల్లేశం సినిమాలో ప్రియదర్శి అందరినీ ఏడిపిస్తాడు. కదిలిస్తాడు. ఆలోచింపజేస్తాడు. ఇక ఇప్పుడు బలగం సినిమాలోనూ ప్రియదర్శి తన నటనతో సాయిలు పాత్రకు ప్రాణం పోశాడు. క్లైమాక్స్‌లో ప్రియదర్శి ఏడిపించేస్తాడు. తాత మీదున్న ప్రేమను చూపించే సన్నివేశంలో ఆడియెన్స్‌ను ఏడిపించేస్తాడు.
సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తన ఫ్యామిలీ, తన తాత, తన ఇంటిని గుర్తుకు చేసేస్తుంది బలగం మూవీ. ఈ సినిమాతో ప్రియదర్శి మరోసారి తన నటనా కౌశలాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేసేయగలను అని నిరూపించాడు. అయితే తాజాగా బలగం సినిమాను తన అత్తమ్మకు అంకితం చేస్తున్నానని పోస్ట్ వేశాడు.
మమ్మీ.. ఫిల్మ్ హిట్ అయింది.. ఈ సినిమాను నీకు చూపించాలని నా మనసు కోరుతోంది.. కిందకు ఒకసారి రా.. ఈ బలగం సినిమా నీకోసమే అంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అయితే ఆ పెద్దావిడ ప్రియదర్శి అమ్మగారు అని అంతా అనుకున్నారు. కాసేపటికే ప్రియదర్శి మళ్లీ క్లారిటీ ఇచ్చారు. ఆవిడ తన అమ్మగారు కాదని, అత్తగారు అని, ఈ బలగం సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలోనే ఆవిడ మరణించారని, అందుకే ఈ సినిమాను ఆవిడకే అంకితం చేస్తున్నానంటూ ఎమోషనల్ అయ్యాడు. నిలువెత్తు ప్రేమకు నిదర్శనం తన అత్తమ్మ గారు ఆవిడను తలుచుకుని ప్రియదర్శి ఎమోషనల్ అయ్యాడు.
బలగం సినిమాతో ఎంతో మందికి పేరు వచ్చింది. కొమురయ్య పాత్ర, ఐలయ్య పాత్ర ఇలా చాలా కారెక్టర్లు మన వెంట వచ్చేస్తుంటాయి. తెలంగాణ సమాజాన్ని, జీవన శైలిని అద్దం పట్టేలా కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు ఎంతో అద్భుతంగా చూపించాడు. అయితే ఈ సినిమా మీద సైతం కాపీ మరకలు అంటుకున్నాయి. బలగం కథను తాను ఎప్పుడో రాసుకున్నాను అంటూ సతీష్ గడ్డం ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అవన్నీ పక్కన పెడితే ఈ బలగం మాత్రం ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని ఎంతో సహజంగా చూపించిన తీరు అందరినీ మెప్పిస్తోంది.
Also Read: Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook