Bunny Vasu: బన్నీ వాసుకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. లేదంటే వరదల్లో?
Producer Bunny Vasu narrowly missed an accident in Godavari: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలంలో నిర్మాత బన్నీ వాసుకు తృటిలో ప్రమాదం తప్పింది.
Producer Bunny Vasu narrowly missed an accident in Godavari: డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించి అల్లు అర్జున్ స్నేహితుడిగా మారిన బన్నీ వాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అల్లు అరవింద్ ఏకంగా గీత ఆర్ట్స్ 2 పేరిట రెండో బ్యానర్ మొదలుపెట్టి దాని బాధ్యతలు అన్ని బన్నీ వాసుకి అప్పగించి తాను సినిమాల నిర్మాణ విషయంలో కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే బన్నీ వాసు ఒకపక్క సినీ నిర్మాతగా కొనసాగుతూనే మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు.
తాజాగా వరదల నేపథ్యంలో తన స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు గోదావరి నదికి వరదలు వస్తున్న క్రమంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం యలమంచిలి సమీపాన ఉన్న బాడవ అనే గ్రామంలో కొందరు వరదల్లో చిక్కుకున్నారన్న సమాచారం అందుకున్న బన్నీవాసు తనవంతు సాయం అందించేందుకు ఒక పడవలో ఆ ఊరికి వెళ్లారు.
ఆ ఊరిలో గర్భిణిని రక్షించి పడవలో తీసుకొస్తుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో పడవ వరద ఉధృతికి నీటిలో కొట్టుకు పోవడంతో చివరికి ఒక కొబ్బరి చెట్టుకు తగిలింది. ఊచించని ఈ పరిణామంలో పడవలో ఉన్న వారు కంగారు పడి అటూ ఇటూ ఉరికిన నేపథ్యంలో పడవ విరిగి పోయింది.
అయితే కొంతమంది నదిలో పడగా పడవ నడిపే వ్యక్తి వారందరినీ రక్షించారు. ఆ సమయంలో పడవలో పడవలో సినీ నిర్మాత బన్నీవాసు, గర్భిణీ సహా మరికొందరు జనసేన నాయకులు ఉన్నారు. ఇక ఈ క్రమంలో ప్రమాదంలో పడిన ఆయనని కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన నుంచి భయపడ్డ బన్నీ వాసు ప్రమాదం అంచున ఇంకా గోదావరి లంక గ్రామాల ప్రజలు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు.
Also Read: Rakul Preet Singh: ట్రాన్స్ పరెంట్ డ్రెస్లో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్.. మాములు రచ్చ కాదుగా ఇది!
Also Read: Jabardasth: ఒక్క డైలాగ్ తో బులెట్ భాస్కర్ పరువు తీసిన ఖుష్బూ
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.