Jabardasth: ఒక్క డైలాగ్ తో బులెట్ భాస్కర్ పరువు తీసిన ఖుష్బూ

Kushboo Sundar Insults bullet bhaskar in Extra Jabardasth: ఎక్స్ ట్రా జబర్దస్త్ తాజా ప్రోమో ఆద్యంతం కూడా ఆసక్తికరంగా సాగింది. ఈ ప్రోమోలో పాపం భాస్కర్ పరువు తీసిపారేసింది ఖుష్బూ.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 05:01 PM IST
  • ఎక్స్‌ట్రా జబర్దస్త్ జడ్జిగా ఖుష్బూ

    బుల్లెట్ భాస్కర్ పరువు తీసిన ఖుష్బూ

    సరదాగా సాగిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో

 Jabardasth: ఒక్క డైలాగ్ తో బులెట్ భాస్కర్ పరువు తీసిన ఖుష్బూ

Kushboo Sundar Insults bullet bhaskar in Extra Jabardasth: జబర్దస్త్ ప్రోగ్రాం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి చర్చలు ఎన్ని జరిగినా మరో పక్క జబర్దస్త్ ప్రోగ్రామ్ మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కు సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేయగా ఆ ప్రోమోలో జడ్జిలుగా ఇంద్రజ, ఖుష్బూ కనిపించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఆద్యంతం కూడా ఆసక్తికరంగా సాగింది.

ముందుగా రాకింగ్ రాకేష్ సుజాత స్కిట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఆ తరువాత బుల్లెట్ భాస్కర్-ఫహీమా, పవిత్ర-ఇమ్మానియేల్ కొట్టుకుంటూ కనిపించారు. తర్వాత నాటీ నరేష్ చేసిన అల్లరి గురించి కూడా చూపించారు. ఈa సందర్భంగా నరేష్ కాస్త శృతిమించి ఒక అమ్మాయి బుగ్గ గిల్లినట్లు చూపించడంతో ఖుష్బూ నరేష్ గారు ఈ రోజు ఏంటి కాస్త ఎక్కువ చేస్తున్నారు. ఎప్పుడూ అంతేనా లేక నేను వచ్చానని అలా చేస్తున్నారా అంటే, మీరు వచ్చారని అలా చేస్తున్నాను అంటూ నరేష్ సిగ్గుపడతాడు.

ఇక అలా సరదా సరదాగా సాగిపోతున్న కార్యక్రమంలో చివరిగా కుష్బూ గారితో నటించిన హీరోలు అంటూ కొంతమందిని తీసుకొచ్చారు. అందులో బుల్లెట్ భాస్కర్ మెగాస్టార్ చిరంజీవి డూప్ గా నటించడానికి ప్రయత్నించాడు. అయితే ఖుష్బూ గారితో మాట్లాడుతున్న సమయంలో ఆయన నాగార్జున వాయిస్ మాడ్యులేషన్ తో మాట్లాడడంతో ఖుష్బూ హాయ్ నాగ్ అని అనడంతో పాపం బుల్లెట్ భాస్కర్ పరువు ఒక్కసారిగా పోయింది.

తర్వాత మెగాస్టార్ వాయిస్ మాడ్యులేషన్ చేయడానికి ప్రయత్నం చేసినట్లు ప్రోమోలో చూపించారు. మొత్తం మీద చాలాకాలం తర్వాత కుష్బూ రాకతో జబర్దస్త్ కాస్త సందడి సందడిగా సాగుతోంది. సోషల్ మీడియాలో నెటిజెన్లు కూడా కుష్బూ వచ్చిన తర్వాత బాగుందని ఇలాగే కంటిన్యూ చేయమని సలహాలు ఇస్తున్నారు.
Also Read: Srinu Vaitla: విడాకులకు సిద్దమైన డైరెక్టర్ శ్రీను వైట్ల-రూప వైట్ల.. అసలు ఏమైందంటే?

Also Read: Tollywood Shootings Bundh: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం.. షూటింగ్స్ బంద్?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News