Abhiram Daggubati Wedding: నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఇంట పెళ్లి సంబరాలు మొదలైపోయాయి. సురేష్ బాబు కొడుకు.. రానా తమ్ముడు అయినా దగ్గుపాటి అభిరామ్ డిసెంబర్ 7న పెళ్లి చేసుకోనున్నారు. ముందుగా శ్రీరెడ్డి వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ నెగిటివ్ ప్రచారం తెచ్చుకున్న దగ్గుబాటి అభిరామ్ ఈ మధ్యనే తేజా దర్శకత్వంలో వచ్చిన అహింషా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోగా పరిచయమయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రామానాయుడు మనవడు అలానే వెంకటేష్ అన్న సురేష్ బాబు కొడుకు కావడంతో ఈ హీరో మొదటి సినిమా ప్రమోషన్లు వేరే లెవెల్ లో జరుగుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ అవేమీ లేకుండా తన మొదటి సినిమాని చాలా సైలెంట్ గా విడుదల చేశారు ఈ హీరో. అందుకు తగ్గట్టే ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. కాగా ఇప్పుడు తన మొదటి సినిమా కాగానే పెళ్లికి సిద్ధమైపోయారు అభిరామ్.


డిసెంబర్ 6న అభిరామ్ వివాహం జ‌ర‌గబోతోందని తెలుస్తోంది. రామానాయుడు బంధువులమ్మాయి ప్ర‌త్యూష‌తో ద‌గ్గుబాటి అభిరామ్ వివాహం జరగనుంది.
కాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి కోసం దగ్గుబాటి కుటుంబం భిన్నంగా ప్లాన్ చేసింది. ప్రస్తుతం అందరూ డెస్టినేషన్ వెడ్డింగ్ ల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండగా అభిరామ్ వివాహాన్ని కూడా దగ్గుబాటి ఫ్యామిలీ వారు డెస్టినేష‌న్ వెడ్డింగ్ చెయ్యనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. 


దగ్గుబాటి అభిరామ్, ప్రత్యష పెళ్లికి కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితులు హాజరు కానున్నారట. వీరి స‌మ‌క్షంలో వేద‌మంత్రాల సాక్షిగా ప్ర‌త్యూష.. అభిరామ్ తమ కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. బంధుమిత్రులు, సినీ-రాజకీయ సెలబ్రిటీల‌తో స‌హా అభిరామ్‌ పెళ్లిలో మొత్తం 200 మంది హాజరు కానున్నారని తెలుస్తోంది. 


ఇక ఈ వివాహం ఏకంగా శ్రీ‌లంక‌లో జరగబోతోంది. అయితే ఇది తెలుసుకున్న దగ్గుబాటి ఫ్యాన్స్ మాత్రం ఇదేంది అక్కడ ఎందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అభిరామ్ పెళ్లి శ్రీలంకలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్లో జరగనుంది. ఇక ఈరోజు డిసెంబర్ 4 నుంచి అక్కడ వీరిద్దరి పెళ్లి సంబరాలు మొదలైపోయాయట.  హ‌ల్దీ, మెహందీ, సంగీత్ వంటి కార్య‌క్ర‌మాల‌తో మొత్తం మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుక జరగనుందని టాలీవుడ్ వర్గాలు సమాచారం. ఇక డిసెంబర్ 6న దగ్గుబాటి అభిరామ్ పెళ్లి రాత్రి 8.50 గంట‌ల‌కు జరగనుంది.


Also Read: Telangana Election 2023 Result Live: బీజేపీ విజయం సాధించిన స్థానాలు ఇవే.. కీలక నేతలు ఓటమిపాలు 


Also read: Telangana Election Results 2023: తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటి


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook