Puri Jagannadh Complaint : లైగర్ సినిమా విషయంలో జరుగుతున్న చర్చ అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంతా కలిసి పూరి జగన్నాథ్ ఆఫీస్ ముందు ధర్నా చేద్దామని ప్రయత్నాలు చేయడం అందరికీ తెలిసిందే. ఈ మేరకు వాట్సప్ స్క్రీన్ షాట్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. వరంగల్ శ్రీను, నైజాం ఎగ్జిబిటర్లంతా కూడా ఈ ప్లాన్ వేశారట. అయితే దీనిపై పూరి జగన్నాథ్ సీరియస్ అయినట్టుగా ఓ ఆడియో మెసెజ్ వైరల్ అయింది. ఇలా తన పరువుతీయాలని చూస్తే రూపాయి కూడా ఇవ్వను.. కొంత  ఎమౌంట్ ఇస్తాను అని చెప్పాను.. ఇస్తాను.. అయినా డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.. లాభాలు వస్తే మీరెప్పుడైనా ఇచ్చారా? అంటూ ఇలా తన వర్షెన్‌ను వినిపించాడు పూరి జగన్నాథ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంకో అడుగు ముందుకు వేశాడు. వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్‌ల వల్ల తన కుటుంబానికి హాని ఉందని, తన నుంచి డబ్బు లాగేందుకు ప్రయత్నిస్తున్నారని, తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని చెప్పుకొచ్చాడు పూరి. ఇంకా ఆ ఫిర్యాదులో ఏముందంటే.. తాను ఇవ్వాల్సిన డబ్బు ఉందని భావిస్తే. కోర్టు ద్వారా తేల్చుకోవాలని అన్నాడు. ఇలా అందరినీ హింసకు ప్రేరేపించి.. నాకుటుంబాన్ని శారీరకంగా, మానసికంగా, బ్లాక్ మెయిల్ ద్వారా భయపెట్టి తన నుంచి అక్రమంగా డబ్బు తీసుకోవాలని చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు పూరి. వారి నుంచి తన కుటుంబానికి రక్షణ కల్పించాల్సిందిగా పూరి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


ఇంత జరుగుతున్నా కూడా ఛార్మీ మాత్రం నోరు విప్పడం లేదు. ఒకప్పుడు అయితే రూమర్ల మీద వెంటనే స్పందించేది. ట్విట్టర్లో యమా యాక్టివ్‌గా ఉండేది. వరంగల్ శ్రీను మీద ఇప్పుడు పూరి జగన్నాథ్ ఫిర్యాదు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. లైగర్ స్టేజ్ మీద పూరి, ఛార్మీలను ఆకాశానికెత్తేశాడు. లైగర్‌ సినిమాను భారీ రేటుకు కొన్న వరంగల్ శ్రీను.. ఈ సినిమాను, ఆ దర్శకనిర్మాతలను ఆస్కార్ రేంజ్ అని పొగిడేశాడు. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అవ్వడంతో పరిస్థితులు ఇలా రివర్స్ అయ్యాయి.


పూరి కి అవసరమైనపుడు ఎలా ఆదుకున్నానో తనకు తెలుసుని, కేసులే కావాలంటే టాలీవుడ్ నిర్మాతల డీఫాల్ట్ చెక్కుల కట్టలు కట్టలు తమ దగ్గరున్నాయని కౌంటర్లు వేశాడు ఫైనాన్షియర్ శోభన్. లైగర్ విడుదలైనప్పటి నుంచి ఫోన్ ఎత్తని వాళ్లని ఎలా బెదిరించగలమని పూరి ఫిర్యాదుపై స్పందించాడు శోభన్. సమాచారం ఇవ్వడం కూడా బెదిరింపేనా? అని ఫైనాన్షియర్ శోభన్ అన్నాడు. ఇంత జరుగుతున్నా కూడా ఛార్మీ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. నోరు విప్పి మాట్లాడటం లేదు. ఓ ట్వీట్ కూడా వేయడం లేదు.


Also Read : Allu Sneha Reddy Video : అదరహో అనిపించేలా అల్లు స్నేహారెడ్డి.. అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోన్న బన్నీ భార్య


Also Read : Bigg Boss Geetu : అందుకే గీతూకి గెలిచే అర్హత లేదనేది.. బిగ్ బాస్ హిస్టరీలోనే వరెస్ట్ కంటెస్టెంట్‌?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి