Sandhya theatre stampede incident: పుష్ప2 సినిమా వేళ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవత్ అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో ప్రస్తుతం ఆస్పత్రిలో శ్రీతేజ్ అత్యవసర పరిస్థితుల్లో చికిత్స తీసుకుంటున్నారు.   ఇటీవల హైదరబాద్ సీపీ సీవీ ఆనంద్ బాలుడ్ని పరామర్శించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా బాలుడికి మాత్రం.. పైపుల ద్వారా ఆహారం అందిస్తున్నట్లు కూడా వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా..  ప్రస్తుతం దీనిపై పెనుదుమారం చెలరేగిందని చెప్పుకొవచ్చు. బాలుడ్ని ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. తాజాగా.. బాలుడ్ని అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించినట్లు తెలుస్తొంది. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తొంది.


బాలుడు తొందరగా కొలుకోవాలని కూడా చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే అల్లు అర్జున్.. బాలుడ్ని పరామర్శించాలని అనుకున్నప్పటికి..కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో కలవకూడదని లీగల్ టీమ్ చెప్పినట్లు తెలుస్తొంది.


Read more: Viral Video: జగన్నాథుడి ముందు వంగి ప్రార్ధించిన కోడి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..


అందుకే ప్రస్తుతం.. శ్రీతేజ్ కోలుకోవాలని కూడా ప్రార్థించినట్లు సమాచారం. మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై.. పోలీసులు హైకోర్టులో మరోక పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తొంది.  అల్లు అర్జున్ కు ప్రస్తుతం ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తొంది. మరోవైపు బన్నీ టీమ్ ఇటీవల ఖర్చులు తామే భరిస్తున్నామని చెప్పినట్లు తెలుస్తొంది. కానీ సీపీ సీవీ ఆనంద్ మాత్రం.. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని కూడా స్పష్టం చేశారు.


దీంతో అల్లు అర్జున్ పై మరల.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ ను మరల అరెస్టు చేస్తారని కూడా వాదనలు విన్పిస్తున్నాయి.  ఇటీవల రేవంత్.. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కొంత మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter