Pushpa 2 Success Celebrations Controversy: ఫ్యాన్ చనిపోతే పుష్ప 2 సక్సస్ సంబురాలా..? అల్లు అర్జున్ తీరుపై నెటిజన్స్ మండిపాటు..
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Pushpa 2 Success Celebrations Controversy: పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా వుంది. ప్రస్తుతం అతను నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరో వైపు పుష్ప-2 సినిమా విజయవంతం అవ్వడంపై హీరో అల్లు అర్జున్ ఇంటివద్ద రాత్రి తపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పుష్ప-2 మూవీ చూసేందుకు వెళ్ళిన ఓ కుటుంబం విషాదంలో మునిగిపోతే… అదే సినిమా హీరో ఇంట్లో సంబరాలు చేసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
మరోవైపు ఈ ఘటనపై అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ముందుకు వచ్చింది. అంతేకాదు వారి కుటుంబంలో జరిగిన విషాదంపై సంతాపం ప్రకటించారు. పోయిన మనిషి ఎలాగో తీసుకురాలేము. అంతేకాదు బాలుడికి అయ్యే చికిత్స ఖర్చులు భరిస్తామని ముందుకొచ్చారు. అంతేకాదు వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మరోవైపు పుష్ప 2 మూవీకి దేశ వ్యాప్తంగా అన్ని సెంటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక హిందీలో కూడా పుష్ప రాజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో రికార్డులు నమోదు చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఒక రీజనల్ హీరో సినిమాకు ఈ రేంజ్ లో అక్కడ వసూళ్లు రాబట్టడంపై ట్రేడ్ పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. అంతేకాదు పుష్ప 2 ఫస్ట్ డే ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు. అంతేకాదు ఫస్ట్ డే తన పేరిట పలు రికార్డులను తిరగరాయనున్నట్టు తెలుస్తుంది. మరికాసేట్లో ఈ కలెక్షన్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.