Pushpa 2 trailer: పుష్ప -2 ట్రైలర్.. పుష్ప గాడు ప్రేక్షకులను మెప్పించాడా.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..?
Pushpa 2 Trailer : ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప -2.. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.. మరి ఈ ట్రైలర్ పుష్ప కంటే బెటర్ గా ఉందా? లేక పేలవంగా మారిందా.. ?అసలు ఈ ట్రైలర్ స్టేటస్ ఏంటి ?ఈ ట్రైలర్ చూసిన తర్వాత నెటిజెన్స్ అభిప్రాయం ఏంటి ?అనే విషయం ఇప్పుడు చూద్దాం.
Pushpa 2 Trailer Review: "పుష్ప అంటే పేరు కాదు.. వైల్డ్ ఫైర్" అంటూ సందడి చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. ఇకపోతే అభిమానులు, సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన పుష్ప -2 ట్రైలర్ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం విడుదలైన ఈ ట్రైలర్ అభిమానుల అంచనాలను అందుకుంది.
డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. చిత్ర బృందం బీహార్ రాజధాని పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించి, ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నటించింది.
ఇకపోతే ట్రైలర్ చూసిన ప్రేక్షకులు అరాచకం సృష్టించారు సామీ , పుష్ప -2 ట్రైలర్ ను పవర్ ప్యాక్డ్ యాక్షన్స్ తో నింపేశాడు డైరెక్టర్ సుకుమార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా బన్నీ చెప్పే డైలాగ్స్, యాక్షన్ సీన్స్, దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలాగే ఫహద్ లుక్, యాక్షన్ అన్నీ కూడా అదిరిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు జాతర సీక్వెన్స్ లో గజ్జ కట్టి అల్లు అర్జున్ కనిపించిన తీరు ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా బన్నీ ఆర్మీ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ట్రైలర్ పూర్తి వినోదాన్ని పంచింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మాస్ అండ్ యాక్షన్ పర్ఫామెన్స్ తో బన్నీ అదరగొట్టేసాడని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఇక చివర్లో బన్నీ "పుష్పగాడు అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ ఫైర్ బ్రాండ్" అంటూ చెప్పిన డైలాగ్ మరింత ఆకట్టుకుంది. మొత్తానికి అయితే డైలాగ్స్ తోనే కాదు యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో బన్నీ అదరగొట్టేసారని చెప్పవచ్చు. మొత్తానికైతే నెటిజన్స్ పుష్ప -2 మరో రేంజ్ అందుకోవడం గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.