Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?
Allu Arjun Team in Russia అల్లు అర్జున్ టీం ప్రస్తుతం రష్యా అంతా గాలించినట్టు కనిపిస్తోంది. పుష్ప విడుదలై దాదాపు ఏడాదికావొస్తుంది. ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేసేశారు.
Allu Arjun Team in Russia అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీస్ దశను మార్చేసింది పుష్ప చిత్రం. పుష్ప ది రైజ్ రిలీజ్ సమయంలో ఉన్న అంచనాలు, పరిస్థితులన్నీ వేరు. అసలు ఒకప్పుడు పుష్ప హిందీ హక్కులు ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాలేదు. అసలు హిందీలో ఈ చిత్రం ఉంటుందా? లేదా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. చివరకు ఓ పాట కూడా హిందీలో రిలీజ్ చేయలేదు ఆ మధ్య. కొన్ని సార్లు హిందీలో టైటిల్ కూడా కనిపించేది కాదు.
అయితే పుష్ప చిత్రం హిందీ బెల్టులో దుమ్ములేపేసింది. వందకోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టించింది. అలా మొదటి పార్ట్ ఊహించిన విజయం సాధించడంతో రెండో పార్టును భారీ ఎత్తున ప్లాన్ చేశారు. అందుకే ఈ సినిమా స్థాయిని పెంచేలా మేకింగ్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టే ఈ మూవీ షూటింగ్‌ను ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాను రష్యాలో విడుదల చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్‌లో రిలీజ్ చేస్తూ రాజమౌళి టీం ఎలా సందడి చేసిందో.. అలానే పుష్ప కోసం రష్యాలో సుకుమార్ టీం దిగింది.
కాకపోతే అక్కడ జక్కన్న హవా ఉంటే.. ఇక్కడ మాత్రం బన్నీ హవా ఉంది. బన్నీ వల్లే నిర్మాతలకు తడిసి మోపడైనట్టు కనిపిస్తోంది. రష్యాలో పుష్ప కోసం దాదాపు ఐదు కోట్లు ఖర్చైందట. అసలే మనకు అక్కడ మార్కెట్ కూడా లేదు. ఈ మొత్తాన్ని రాబడుతుందా? లేదా? అన్నది చూడాలి. ముందుగా ఈ సినిమా కోసం అక్కడ రెండు, మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెడదామని అనుకుందట టీం. కానీ బన్నీ టీం నుంచి ఎక్కువ మంది సభ్యులు రావడంతో ఖర్చు పెరిగిపోయిందట.
మరి ఒక వేళ పుష్ప అక్కడ కూడా మేజిక్ చేసి బ్లాక్ బస్టర్ అయితే.. మనకు మరో కొత్త మార్కెట్ దొరికినట్టే. ఇప్పుడు తెలుగు సినిమాలకు జపాన్‌లోనూ క్రేజ్ పెరిగింది. ఇక రష్యాలో పుష్ప దారులు తెరుస్తుందా? లేదా? అన్నది చూడాలి.
Also Read : Jr NTR Family : అమెరికాకు చెక్కేసిన ఎన్టీఆర్.. ఫ్యామిలీతో కలిసి చిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook