టాలీవుడ్ దర్శకులు ఇతర రచయితల కథలను దోచుకుంటున్నారని సాహిత్య అకాడమీ యువ పురస్కార్ విజేత వేంపల్లి గంగాధర్ ( Vempalli Gangadhar ) ఆరోపించారు. గంగాధర్ రాసిన ‘తమిళ కూలీ’ ( Tamila Coolie ) అనే కథలో చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు ( Red Sandal smuggling ) వచ్చిన తమిళ కూలీలపై కేసు గురించి ఉంటుంది. ఈ కథను తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్లు కనీసం పేరు రిఫరెన్స్‌గా కూడా ఇవ్వకుండా సాహిత్యకారుల శ్రమను దోచుకుంటున్నారని గంగాధర్ ఆరోపించారు. కాని తన కథను ప్రస్తుతం వాడుకుంటున్నది ఎవరు అనేది మాత్రం ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా తాను పుష్ప మూవీ డైరెక్టర్ సుకుమార్‌నే టార్గెట్ చేసుకున్నట్టుగా ఆ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఫోటోను డా గంగాధర్ తన ఫేస్‌బుక్ పోస్టులో షేర్ చేసుకున్నారు. Also read : Rana Daggubati honeymoon destination: రానా హనీమూన్‌కి ఎక్కడికి వెళ్లనున్నాడో తెలుసా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి...ముందుగానే రాసి పెట్టిన కథలను ,పుస్తకాన్ని, వ్యాసాలను...

Posted by Vempalli Gangadhar on Tuesday, August 25, 2020

 


ప్రస్తుతం ఎర్ర చందనం స్మగ్లింగ్ ( Red sandal smuggling ) గురించి తెరకెక్కుతున్న పెద్ద చిత్రం ఏదైనా ఉందా అంటే అది సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న పుష్ప సినిమానే ( Pushpa movie ). అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో నటిస్తుండగా అతడి సరసన రష్మిక మందన్న ( Rashmika Mandanna )  జంటగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉద్దేశించే డా వేంపల్లి గంగాధర్ ఈ ఆరోపణలు చేశారని ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. Also read : Ram Charan: రాంచరణ్ డ్రీమ్ ప్రాజెక్టు అదేనట


[[{"fid":"191673","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, రచయిత వెంపల్లి గంగాధర్ తెలుగు దర్శకులపై ఆరోపణలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Jr Ntr ) నటించిన ‘అరవింద సమేత’ ( Aravinda Sametha ) చిత్రం కోసం ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘మొండి కత్తి’ అనే కథని వాడుకున్నట్లు గంగాధర్ ఆరోపించారు. అప్పట్లో అదో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడిలా పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్‌ని పరోక్షంగా టార్గెట్ చేసుకుంటూ గంగాధర్ ఈ ఆరోపణలు చేశారని ఆయన వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గంగాధర్ ఆరోపణలపై సుకుమార్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి. Also read : Tamannah parents: తమన్నా తల్లిదండ్రులకు కరోనా.. తమన్నాకూ కరోనా పరీక్షలు