Pushpa Trailer launching: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. పుష్ప మూవీ ట్రైలర్ విడుదలకు ఇంకొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. డిసెంబర్ 17న పుష్ప మూవీ విడుదల కానుండటంతో అంతకంటే పది రోజులు ముందుగా పుష్ప ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. ఇదే విషయాన్ని మరో టీజర్ వీడియో ద్వారా వెల్లడించింది. డిసెంబర్ 6న పుష్ప ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ఆ టీజర్ వీడియోలో పుష్ప మేకర్స్ పేర్కొన్నారు. పుష్ప ట్రైలర్ లాంచింగ్ డేట్ వెల్లడిస్తూ విడుదల చేసిన టీజర్ వీడియోకు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ (Allu Arjun fans) నుంచి భారీ స్పందన లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 


టీజర్ వీడియోకు వస్తున్న స్పందన చూస్తుంటే.. పుష్ప ట్రైలర్‌కి (Pushpa Trailer latest updates) ఇంకెంత స్పందన లభిస్తుందో అనే టాక్ వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పుష్ప మూవీ రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రానుంది. అందులో మొదటి భాగం పేరు పుష్ప: ది రైజ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మంధన (Rashmika Mandanna) జంటగా నటిస్తోంది. మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆధారంగా పుష్ప మూవీ తెరకెక్కుతోంది.