Raayan World Wide Closing Box Office Collection: రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న ధనుశ్.. ఈ సారి ‘రాయన్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ధనుశ్ యాక్టర్ గానే కాకుండా.. డైరెక్టర్ గా  సత్తా చాటిన అతికొద్ది మంది కథానాయకుల్లో ధనుశ్ ఒకరు. తాజాగా ఈయన ఓన్ డైరెక్షన్ లో ‘రాయన్’ మూవీ  తెరకెక్కించాడు. జూలై 26న విడుదలై యావరేజ్ టాక్ తో మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగు ‘రాయన్’ మూవీ రూ.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం ఇంకా బాక్సాఫీస్ దగ్గర రూ. 7.28 కోట్ల షేర్ (రూ. 14.55 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి హిట్ గా నిలిచింది. మొత్తంగా తెలుగులో చేసిన బిజినెస్ మీద రూ. 1.78 కోట్ల ప్రాఫిట్ ను అందుకొని ధనుశ్ కు తెలుగులో మంచి సక్సెస్ అందించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక రాయన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ విషయానికొస్తే..


తమిళనాడులో రూ. 78.10 కోట్ల గ్రాస్..
తెలుగు రాష్ట్రాల్లో రూ. 14.55 కోట్ల గ్రాస్..
కర్ణాటకలో రూ. 10.35 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
కేరళలో రూ. 5.85 కోట్ల గ్రాస్..
హిందీ మరియు రెస్ట్ ఆఫ్ భారత కలిపి రూ. 3.40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఓవర్సీస్ లో ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 43.00 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తంగా  ప్రపంచ వ్యాప్తంగా ‘రాయన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 155.25 కోట్ల గ్రాస్ (రూ. 73.75 కోట్ల షేర్ ) రాబట్టింది.


రాయన్ మూవీ వరల్డ్ వైడ్ గా  రూ.45 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.75 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో రూ. 27.75 కోట్ల లాభాలను తీసుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.   డిఫరెంట్ కాన్సెప్ట్ తో ధనుశ్  డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు, బయ్యర్స్ కు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అంతేకాదు ధనుశ్ కెరీర్ లోనే ఈ సినిమా ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.