Radhe Shyam trailer launch event live: ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి సమయం ఇది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. సినీ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా రామోజీ ఫిలిం సిటీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల (Prabhas fans) కోసం నిర్వహిస్తున్న పండగలాంటి ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే రాధే శ్యామ్ ట్రైలర్ (Radhe Shyam trailer) కూడా లాంచ్ చేయనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్, పూజా హెగ్డే (Prabhas, Pooja Hegde) జంటగా నటిస్తున్న ఈ సినిమాను జిల్ మూవీ డైరెక్టర్ రాధే శ్యామ్ డైరెక్ట్ చేస్తున్నాడు. బాలీవుడ్‌కి చెందిన ఫేమస్ ప్రొడక్షన్ హౌజ్ టీ సిరీస్‌తో కలిసి యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై కృష్ణం రాజు ప్రజెంట్ చేస్తున్నాడు. రాధే శ్యామ్ మూవీకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. రెసుల్ పూకుట్టి సౌండ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తి లైవ్ కవరేజ్ (Radhe Shyam pre-release event live full video) కోసం ఈ కింది వీడియో చూడండి.



Also read : Radhe Shyam: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్‌ స్క్రీన్ పై 'రాధేశ్యామ్' స్పెషల్‌ షోస్‌.. అడ్వాన్స్‌ బుకింగ్‌ ప్రారంభం


వచ్చే ఏడాది సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న రాధే శ్యామ్ మూవీ వరల్డ్ వైడ్ రిలీజ్ (Radhe Shyam movie release date) కాబోతోంది. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మళయాళం, చైనీస్, జపనీస్ భాషల్లోనూ రాధే శ్యామ్ మూవీ విడుదల అవుతోంది. రాధే శ్యామ్ మూవీకి ఉన్న మరో ఘనత ఏంటంటే.. గతంలో అనేక చిత్రాలు ఇండియాలో సూపర్ హిట్ అయ్యాకే ఇతర దేశాల్లో వారి భాషల్లో విడుదలయ్యాయి. కానీ రాధే శ్యామ్ మూవీ చైనా, జపాన్‌లోనూ డైరక్ట్ రిలీజ్ కావడం మరో విశేషం.


Also read : Unstoppable with NBK: బాలయ్య సంధించిన మిలియన్ డాలర్ ప్రశ్న-జవాబు చెప్పగలరా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook