Unstoppable with NBK: బాలయ్య సంధించిన మిలియన్ డాలర్ ప్రశ్న-జవాబు చెప్పగలరా?

Unstoppable with NBK: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ లేటేస్ట్ షోలో ప్రేక్షకులకు బాలయ్య ఓ మిలియన్ డాలర్ ప్రశ్నను సంధించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 05:57 PM IST
  • అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న బాలయ్య
  • లేటెస్ట్ ఎపిసోడ్‌లో అభిమానులకు మిలియన్ డాలర్ ప్రశ్న
  • ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌ను నెరేట్ చేసిన బాలయ్య
Unstoppable with NBK: బాలయ్య సంధించిన మిలియన్ డాలర్ ప్రశ్న-జవాబు చెప్పగలరా?

Unstoppable with NBK: వెండి తెరపై గంభీరమైన డైలాగులు, భీకరమైన ఫైట్లతో అలరించే బాలయ్య... అన్‌స్టాపబుల్ షోలో తన టైమ్లీ పంచ్‌లు, హ్యూమర్‌తో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. దీంతో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా దర్శక ధీర రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొనగా.. ఆ ఇద్దరితో ముచ్చటిస్తూ బాలకృష్ణ ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌ను వివరించారు. ఆ సీన్‌లో ఆయన చెప్పిన సినిమా టైటిల్స్ ఏ సినిమాకు సంబంధించినవి అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.

ఇంతకీ బాలయ్య వివరించిన సీన్ ఏంటంటే.. ఓ వ్యక్తి చనిపోవడానికి సిద్ధమై తుపాకీ ముందు పెట్టుకుంటాడు... తుపాకీతో పాటు మందు గ్లాసు కూడా ఉంటుంది... ఎదురుగా స్క్రీన్‌పై సినిమా టైటిల్స్ రోల్ అవుతుంటాయి... గ్లాసులో మందు తాగేసి తుపాకీ తల దగ్గర పెట్టుకుని కాల్చుకోబోతాడు... కానీ అది పేలదు... మళ్లీ మందు తాగి... తుపాకీతో కాల్చుకోబోతాడు... ఈసారీ అది పేలదు... దీంతో మళ్లీ మందు గ్లాసు ఎత్తి... ఆపై మరోసారి గన్‌ను తల దగ్గర పెట్టుకుని కాల్చుకోబోతాడు... ఈసారి కూడా గన్ పేలదు... దీంతో మళ్లీ గన్ పక్కనపెట్టి మందు గ్లాసు పట్టుకోబోతాడు... ఇంతలో ముందు నుంచి మరో గన్ వచ్చి అతని తలను పేల్చేస్తుంది.. స్క్రీన్‌పై డైరెక్టర్ అని పడుతుంది.

బాలకృష్ణ వివరించిన సన్నివేశంలో పేర్కొన్న టైటిల్స్.. ఏ సినిమాకు సంబంధించినవి అనేది ఓ పజిల్‌లా మారింది. ఆహా ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. గతంలో 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..' అనే ప్రశ్న ఎంతగా జనం నోళ్లలో నానిందో... ఇప్పుడు ఇది కూడా ఆ రేంజ్‌లో జనంలోకి వెళ్తుందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంతకీ బాలకృష్ణ పేర్కొన్న ఆ సినిమా టైటిల్స్ ఏ సినిమాకు సంబంధించినవో మీరు చెప్పగలరా... తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.

Also Read: Nora Fatehi Car Accident: బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి కారుకు ప్రమాదం.. నటి పరిస్థితి ఎలా ఉందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News