RGV సినిమా షూటింగులో exploitation: రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్
Radhika Apte about exploitation in RGV films: రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టె బోల్డ్ కామెంట్స్ చేసింది. నటులు సూర్య ప్రధాన పాత్రలో ఆర్జీవీ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టె ఓ విలేజ్ గాళ్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రక్త చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో తాను పూర్తిగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని రాధికా ఆప్టె వెల్లడించింది.
Radhika Apte about exploitation in RGV films: రామ్ గోపాల్ వర్మపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టె బోల్డ్ కామెంట్స్ చేసింది. నటులు సూర్య ప్రధాన పాత్రలో ఆర్జీవీ తెరకెక్కించిన రక్త చరిత్ర సినిమాలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టె ఓ విలేజ్ గాళ్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రక్త చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో తాను పూర్తిగా ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని రాధికా ఆప్టె వెల్లడించింది. ఈ సినిమాలో తనకు అంత ఎక్కువ పారితోషికం కూడా చెల్లించలేదని, కానీ వాడకం విషయంలో మాత్రం ఇష్టానుసారంగా వాడేశారని చెప్పుకుని వాపోయింది. ఒక సినిమాకు అని సైన్ చేయించుకున్నారు. తీరా సెట్స్‌లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టేనన్నమాట అని రక్త చరిత్ర సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కున్న ఇబ్బందులను తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది.
సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలీదు. ఎప్పుడో ముగుస్తుందో తెలీదు. తన టాలెంట్‌కి కానీ తన సమయానికి కానీ విలువ లేదనిపించింది. వాస్తవానికి తాను రామ్ గోపాల్ వర్మ అభిమానిని. వర్మ తెరకెక్కించిన రంగీలా, సత్య చిత్రాలంటే చాలా ఇష్టం. అందుకే వర్మ సినిమాకు పనిచేస్తే.. ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత ఒకానొక దశలో రక్త చరిత్రకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
రామ్ గోపాల్ వర్మ (RGV) మాట్లాడితే ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రాధికా ఆప్టే (Radhika Apte) కూడా బోల్డ్ స్టేట్‌మెంట్స్ ఇవ్వడంలో వర్మ టైప్ హీరోయినే. కానీ అలాంటి రాధికా ఆప్టేనే వర్మపై ఈ వ్యాఖ్యలు చేసింది. రాధికా ఆప్టే చేసిన ఈ వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ లైట్ తీసుకుంటాడో లేక ఏదైనా కామెంట్ చేస్తాడో వేచిచూడాల్సిందే మరి.